English   

అఖిల్ ల‌వ‌ర్ జాత‌కం మారిందిగా..!

Sayesha Saigal
2018-06-14 10:21:24

ఒక్క సినిమాతో ఎప్పుడూ ఎవ‌రి జాత‌కం లెక్క వేయ‌కూడదు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో ఎవ‌రి జాత‌కం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ‌రికి ఐడియా ఉండ‌దు. స‌యేషా సైగ‌ల్ కూడా అంతే. ఈ భామ తొలి సినిమా డిజాస్ట‌ర్. అఖిల్ తో అఖిల్ సినిమాలో న‌టించింది ఈ భామ‌. కానీ ఈ చిత్రం చ‌రిత్ర‌లో నిలిచిపోయే చెత్త సినిమాగా మారింది. దాంతో సింగిల్ సినిమా వండ‌ర్ లా తెలుగులో మిగిలిపోయింది స‌యేషా. అయితే అర‌వోళ్లు మాత్రం మ‌నం కాద‌నుకున్న ముద్దుగుమ్మ‌ల‌ను అంద‌లం ఎక్కించ‌డం అల‌వాటు చేసుకున్నారు. ఆ మ‌ధ్య హిందీలో అజ‌య్ దేవ్ గ‌న్ తో శివాయ్ సినిమాలో న‌టించింది స‌యేషా. ఆ త‌ర్వాత పూర్తిగా త‌మిళ ఇండ‌స్ట్రీకే ప‌రిమితమైంది ఈ బ్యూటీ. అక్క‌డే వాళ్లు చేర‌దీస్తున్నారు ఈ భామ‌ను. ఇప్ప‌టికే అక్క‌డ జ‌యంర‌వి లాంటి క్రేజీ హీరోల‌తో న‌టించింది స‌యేషా సైగ‌ల్. అయితేనేం.. ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంది స‌యేషా. అవి కూడా చిన్న సినిమాలేం కాదు.. విజ‌య్ సేతుప‌తితో జంగ‌.. ఆర్య‌తో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ రీమేక్ గ‌జినీకాంత్.. కార్తితో క‌డై కుట్టి సింగం.. ఈ మూడు చిత్రాలు త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. ప్ర‌స్తుతం విడుద‌లైన జంగా ట్రైల‌ర్ లో గ్లామ‌ర్ షో కూడా బాగానే చేసింది స‌యేషా. వాటికి తోడు సూర్య‌తోనూ ఓ సినిమా చేయ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇలా చాలా సినిమాల్లో న‌టిస్తుంది అఖిల్ బ్యూటీ. ఇవ‌న్నీ కానీ హిట్టైతే స‌యేషా ద‌శ మారిపోయిన‌ట్లే..! 

More Related Stories