English   

సునిత దారిలోనే సురేఖ వాని

Surekha Vani
2021-02-20 11:04:36

టాలీవుడ్ లో తల్లి, అక్క క్యారెక్టర్ లతో పాటు ఇతర పాత్రలు చేసి మెప్పించిన వారిలో సురేఖ వాని కూడా ఒకరు. సురేఖ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా మంచు విష్ణు ఢీ సినిమాలో మాస్టర్ భరత్ కు తల్లిగా నటించిన సురేఖ వాని "చిట్టి నాయుడు సచ్చినోడా" అంటూ మామ పై పై చిర్రు బుర్రు మంటూ కామెడీని పండించింది. అంతే కాకుండా బ్రాహ్మా నందం సరసన కొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలా ఎన్నో సినిమాల్లో నవ్వించిన ఆమె జీవితంలో కూడా ఒక విషాద ఘట్టం ఉంది. అదేంటంటే సురేఖ వాని భర్త సురేష్ 2019లో అనారోగ్యం కారణంగా చనిపోయాడు. 

దాంతో అప్పటి నుండి సురేఖ కూతురుతో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. సురేష్ కూడా ఇండస్ట్రీ కి చెందినవాడే కొన్ని సీరియల్స్ లో నటించడంతో పాటు..మాటీవీ లో కొన్ని ప్రోగ్రాం లకు దర్శకత్వం వహించాడు. భర్త చనిపోయిన సురేఖకు అవకాశాలు కూడా తగ్గాయి. మరోవైపు సీనియర్ హీరోయిన్ లు సైతం అత్త, అక్క క్యారెక్టర్ లు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సురేఖ వానికి ఆమె కూతురు పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చిందని పుకార్లు వాస్తన్నాయి. మరోవైపు సింగర్ సునిత కూడా ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. ఇప్పుడు అదే దారిలో సురేఖ వాని కూడా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

More Related Stories