English   

నారప్ప సెకండ్ సాంగ్ రిలీజ్

Narappa
2021-07-17 12:00:17

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళ్ లో విజయం సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ కి ఇది తెలుగు రీమేక్. వెంకీ సరసన ప్రియమణి నటించింది. థియేటర్లో రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ యాక్షన్ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైలర్‌, చలాకీ చిన్నమ్మి.. పాటల్ని విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన లభించింది.

తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘ఓ.. నారప్ప’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ పాటని ధనుంజయ్‌, వరం ఆలపించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. వెంకటేష్‌, అమ్ము అభిరామి మధ్య ఈ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేష్‌ రెండు విభిన్న పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. యువకుడి పాత్రకి జోడీగా అభిరామి నటించింది. కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి క్రియేషన్స్‌ పతాకం పై కలైపులి ఎస్‌. థాను సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి.. ఓటీటీలో రిలీజ్ అవుతున్న నారప్ప ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

More Related Stories