English   

క్యాస్టింగ్ కౌచ్ పై శర్వానంద్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Seerat Kapoor
2020-09-28 18:01:24

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం సాధారణం అయిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడాలేకుండా ప్రతి పరిశ్రమ నుండి తమకు క్యాస్టింగ్ కౌచ్ వల్ల కలిగిన అనుభవాల్ని హీరోయిన్ లు మీడియా ముందు చెప్పేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ శ్రీరెడ్డి అయితే టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద యుద్ధానికి దిగింది. తనకు ఎలాంటి సపోర్ట్ అందకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడి సెటిల్ అయిపోయింది. గాయని చిన్మయి సైతం కాస్టింగ్ కౌచ్ పై పలు సందర్భాల్లో మండిపడింది. ఇదిలా ఉండగా తాజాగా రన్ రాజా రన్ సినిమాలో శర్వానంద్ సరసన నటించిన బ్యూటీ సీరత్ కపూర్ సైతం క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ జరిగిందంటూ అరవడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని సీరత్ పేర్కొంది. అయితే క్యాస్టింగ్ కౌచ్ నుండి ఎలా భయటపడ్డారో తెలపాలని వ్యాఖ్యానించింది. అలా చేయడం వల్ల ఇతరులు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడకుండా ఉంటారని చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ జరిగుందంటూ కేకలు వేయడం వల్ల పరువు పోవడంతప్ప ఎలాంటి ఉపయోగం లేదని చెప్పింది. అంతే కాకుండా అన్ని   ఇండస్ట్రీ లలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని పేర్కొంది.

More Related Stories