English   

సీటీమార్ టీజర్.. కోర్ట్ లో ఆడితే ఆట..బయట ఆడితే వేట

Seetimaar
2021-02-22 11:56:41

మ్యాచో మ్యాన్ గోపిచంద్ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "సీటీమార్". ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో గోపిచంద్ సరసన మిల్కి బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో గోపిచంద్ తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా నటిస్తుండగా.. తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఇక తాజాగా సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎన్నో మాస్ సినిమాలతో వచ్చిన గోపిచంద్ ఇప్పుడు స్పోర్ట్స్, మాస్ రెండూ మిక్స్ చేసిన "సీటీమార్" తో వస్తున్నాడు. టీజర్ విషయానికొస్తే గోపిచంద్   యాజ్ ఇ టీజ్ గా మాస్ సీన్లతో ఆకట్టుకున్నాడు. టీజర్ పవర్ ఫుల్ డైలాగ్ లతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 2 న విడుదల చేయనున్నారు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న గోపీచంద్ ఏ మేరకు అలరిస్తారో చూడాలి.

More Related Stories