English   

శ‌క‌ల‌కా తేడా వ‌స్తే ల‌క‌ల‌కే..!

Sekalakha shankar

శ‌క‌ల‌క శంక‌ర్.. అప్ప‌ట్లో జ‌బ‌ర్ద‌స్థ్ కామెడీ షోలో ఈ పేరు బాగా పాపుల‌ర్ అయింది. దానికితోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని అంటూ కూడా బాగా ఫేమ్ అయ్యాడు ఈ క‌మెడియ‌న్. ఉన్న‌ట్లుండి జ‌బ‌ర్ద‌స్థ్ మానేసి సినిమాల్లోకి వ‌చ్చాడు. వ‌చ్చీ రావ‌డంతో అప్ప‌ట్లో కొన్ని సినిమాలు కూడా చేసాడు శంక‌ర్. ఇప్పుడు ఈయ‌న ఒకేసారి రెండు సినిమాలు హీరోగా చేస్తున్నాడు. విన‌డానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ఒకందుకు ఇది షాక్ కూడా. ఒకే సారి రెండు సినిమాలు చేయ‌డం ఏంద‌ని ఇప్పుడంతా షాక్ లోనే ఉన్నారు. కానీ శ‌క‌ల‌క శంక‌ర్ మాత్రం త‌న ప‌ని తాను వేగంగా చేసుకుంటూ వెళ్లిపో తున్నాడు. తెలుగులో క‌మెడియ‌న్లు హీరోలుగా మార‌డం ఎప్ప‌ట్నుంచో వ‌స్తున్న ఆన‌వాయితీ. కానీ హీరోగా మారాలంటే ముందు స్టార్ క‌మెడియ‌న్ అయ్యుండాలి. 

అప్పుడే క‌నీసం ఆయన్ని చూడ్డానికి ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు వ‌స్తారు. కానీ స్టార్ క‌మెడియ‌న్ అనే మాట రాక‌ముందే జ‌స్ట్ జ‌బ‌ర్ద‌స్థ్ షోతో పాపుల‌ర్ అయి వెంట‌నే హీరోగా న‌టించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్పుడు శంక‌ర్ ఇదే చేస్తున్నాడు.. శంక‌ర్ అంటే అంద‌రూ గుర్తుప‌ట్ట‌రు శ‌క‌ల‌క శంకర్ అంటేనే గుర్తిస్తారు. ప్ర‌స్తుతం త‌న తోటి జ‌బ‌ర్ద‌స్థ్ క‌మెడియ‌న్ శ్రీ‌ధ‌ర్ ఎన్ ద‌ర్శ‌కుడిగా మారి శంక‌ర్ తోనే శంభో శంక‌రా సినిమా చేస్తున్నాడు. సురేష్ కొండేటి ఈ చిత్రానికి నిర్మాత‌. ఇక డ్రైవ‌ర్ రాముడు అంటూ మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు ఈ క‌మెడియ‌న్. ఈ సినిమాలు నిజంగానే బాగుంటే ఓకే.. లేదంటే శ‌క‌ల‌క‌కు త‌ప్ప‌దు ల‌క‌ల‌కా..! 

More Related Stories