English   

నాని ఒప్పుకున్నాడా..?

sekhar-nani

కొన్ని కాంబినేషన్స్ కోసం ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది. ఆ కాంబినేషన్ పై ఉండే ఎక్స్ పెక్టేషన్స్ అలా ఉంటాయి. అలా ఇన్నాళ్ల పాటు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేయించిన ఆ కాంబినేషన్ సెట్ అయినట్టే అనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ కాంబినేషన్ ఏంటో చెప్పలేదు కదూ.. నేచురల్ స్టార్ నాని, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా. యస్.. లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ కు సంబంధించిన వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఫిదాతో తిరుగులేని హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల రీసెంట్ గా నానికి ఓ పాయింట్ చెప్పాడట. అది నానికి విపరీతంగా నచ్చేసిందని టాక్. నిజానికి ఫిదా తర్వాత శేఖర్ వెంటనే సినిమా స్టార్ట్ చేస్తాడని ఊహించారు. కానీ ప్రతి సినిమాకూ లాంగ్ గ్యాప్ తీసుకునే శేఖర్ ఈ సారీ అలా చేశాడు.. అయితే ఈ సారి అతని వెయిటింగ్ నాని కోసమే అనేది లేటెస్ట్ టాక్. అందుకు తగ్గట్టే నాని నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో ఈ లైన్ డెవలప్ అయిపోయి పక్కా స్క్రీప్ట్ గా మారబోతోందట. ఇక ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడు. కాకపోతే నాని ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధంతో బిజీగా ఉన్నాడు. తర్వాత నాగార్జునతో మల్టీస్టారర్ కు రెడీ అవుతాడు. అంటే ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లాలంటే ఈ యేడాది చివరి వరకూ ఆగాల్సిందే. 

More Related Stories