English   

శ్రీరెడ్డి.. ‘కొమ్ముల’ శేఖర్ గురించి చెప్పింది నిజమేనా..?

Sekhar-Kammula
2018-04-04 11:40:22

కొమ్ములు ఉన్న కమ్ముల అంటూ ఇన్ డైరెక్ట్ గా శ్రీ రెడ్డి చేసిన శ్రీ లీక్స్ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. కొమ్ముల అన్నా అది శేఖర్ కమ్ముల అనే విషయం ఎవరికైనా ఈజీగానే కన్వే అవుతోంది. దీంతో ఇన్నాళ్లూ డీసెంట్ డైరెక్టర్ గా పేరున్న శేఖర్ కమ్ములను తను డైరెక్ట్ గా టార్గెట్ చేయడం నిజంగానే దుమారం రేపుతోంది. అయితే ఈ లీక్స్ పై శేఖర్ చాలా సీరియస్ అయ్యాడు. అసలు తనెప్పుడూ చూడని, కలవని, మాట్లాడని మనిషి తన గురించి ఇలా చెప్పడం కరెక్ట్ కాదన్నాడు. అయినా స్త్రీ స్వాత్యంత్ర్యం గురించి మాట్లాడే తనకు ఇలాంటివి ఆపాదించడం దారుణం అన్నాడు. తన సినిమాల్లో మహిళలను ఎలా చూపిస్తానో అందరికీ తెలుసు.. అది నేను వారికి ఇచ్చే గౌరవం అని చెప్పాడు శేఖర్. అలాగే తను బయట చాలా విమెన్ ఎంపౌర్మెంట్ కు సంబంధించిన అనేక సమావేశాల్లో పాల్గొంటానని.. అలాంటి తనపై ఇలాంటి చీప్ కమెంట్స్ చేయడం క్షమించరాని తప్పుగా ఫీలవుతున్నాడు శేఖర్. అందుకే తను చేసిన తప్పులకు శ్రీ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఒకవేళ సారీ చెప్పకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాననే వార్నింగ్ కూడా ఇచ్చాడు.

నిశితంగా గమనిస్తే ఈ ఇద్దరి మధ్య కొన్ని పోలికలున్నాయి. శ్రీ రెడ్డి.. శేఖర్ కమ్ముల తనను వాడుకున్నాడు అని కానీ, వేరే అమ్మాయిలను వేధించాడని కానీ చెప్పలేదు. కానీ వీడియో చాటింగ్ అంటే పడి చస్తాడని చెప్పుకొచ్చింది. ఆ రకంగా శేఖర్ చెప్పినట్టు ఆమెను డైరెక్ట్ గా చూడ్డం, మాట్లాడ్డం.. వంటివేమీ ఉండవు. అంటే తను కరెక్టా..? ఏమో ఎవరికి తెలుసు.. ఆదర్శాలు చెప్పినవారంతా వాటిని ఫాలో కావాలని లేదు. అలాగే కొందరినే టార్గెట్ చేస్తోన్న శ్రీ రెడ్డి అలాంటి వీడియో కాల్స్ ఉంటే బయటపెట్టొచ్చుగా.. అంటే శేఖర్ కమ్ములపై ఆధారాలు లేని ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డిది తప్పా..?

More Related Stories