English   

మరో క్రేజీ కాంబినేషన్....నిజమేనా ?

nag
2019-06-17 20:58:38

యూత్‌ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా నచ్చేలా సినిమాల‌ని తెర‌కెక్కించడంలో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌ది అందె వేసిన చేయి. చివ‌రిగా ఫిదా అనే సినిమాతో హిట్ కొట్టిన ఆయన త‌ర్వాత కొత్త వారితో ఒక సినిమా చేస్తున్నారు. ఎందుకో ఏమో కానీ ఆ సినిమా విష‌యంలో చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ మ‌ధ్య సునీల్ న‌రేన్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ఉంటుంద‌ని తెలిపిన శేఖ‌ర్ క‌మ్ముల ఈ మధ్య ఆ సినిమాకి మూడు పాట‌లు త‌ప్ప  టాకీ పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేశాడ‌ట‌. ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్ నెల‌ల‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేలా శేఖ‌ర్ క‌మ్ముల స‌న్నాహాలు చేసుకుంటున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఒక క్రేజీ సినిమా చేయనున్నాడని అంటున్నారు. మజిలీ సక్సెస్ తో ఫాంలో ఉన్న నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి ఆయన ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, ఆ సినిమాలో హీరోయిన్ గా సాయి ప‌ల్ల‌విని అనుకుంటున్నారని టాక్. ఫిదాతో సాయి ప‌ల్ల‌విని టాలీవుడ్‌కి తీసుకొచ్చింది శేఖ‌ర్ క‌మ్ములే, ఈ సినిమాకి కూడా ఆమె యాప్ట్ అని  భావించిన ఆయన చర్చలు జరుపుతున్నారట. ఇక ఈ సినిమాకి దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలున్నాయని అంటున్నారు. 

More Related Stories