English   

బ‌న్నీ ఖాతాలో మ‌రో ద‌ర్శ‌కుడు..

allu-arjun
2018-06-21 15:40:34

బ‌న్నీ ఏం చేస్తున్నాడు..? ఇంత‌కీ ఈయ‌న త‌ర్వాతి సినిమా ఏంటి..? ఇప్పుడు ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే ఏం  చేయాల‌నుకుంటున్నాడో బ‌న్నీకి కూడా క్లారిటీ లేదు. ప్ర‌స్తుతానికి అయితే క‌థ‌లు వింటున్నాడు.. ఎవ‌రి క‌థ న‌చ్చితే వాళ్ల‌కే సినిమా చేయాల‌ని చూస్తున్నాడు అల్లుఅర్జున్. చిన్నా పెద్దా.. కొత్త పాత అనే తేడా లేకుండా అంద‌రు ద‌ర్శ‌కులు చెప్పే క‌థ‌లు వింటున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం టూర్ కి టూర్.. క‌థ‌ల‌కు క‌థ‌లు అన్నీ చేస్తున్నాడు ఈ హీరో. నా పేరు సూర్య ఫ్లాప్ త‌ర్వాత బ‌న్నీలో చాలా మార్పులు వ‌చ్చాయి. క‌చ్చితంగా ఈ సారి హిట్ కొట్టి స‌త్తా నిరూపించుకోవాల‌ని చూస్తున్నాడు అల్లుఅర్జున్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. వ‌రుడు త‌ర్వాత డిజాస్ట‌ర్ లేని ఈ హీరోకు నా పేరు సూర్య అలాంటి ఫ‌లితాన్నిచ్చింది. పైగా డిజే కూడా యావ‌రేజ్ గానే ఆడింది. దాంతో ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు బ‌న్నీ. దానికి తోడు చేజేతులా ఓవ‌ర్సీస్ మార్కెట్ చేజారిపోతుంది. అందుకే అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు ఎంచుకుంటున్నాడు. ఈ లిస్ట్ లో శేఖ‌ర్ క‌మ్ముల చేరాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సిందిగా బ‌న్నీ కోరాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. విక్ర‌మ్ కే కుమార్ సైతం బ‌న్నీ కోసం క‌థ రాస్తున్నాడు. మ‌రి వీళ్ల‌లో ఎవ‌రు అల్లు వార‌బ్బాయి ముందు నిల‌బ‌డ‌తారో చూడాలిక‌..!

More Related Stories