English   

శేఖర్ కమ్ములతో మరోసారి సాయిపల్లవి

sekhar-kammula-sai-pallavi

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా వచ్చిన ఫిదా లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వరుణ్ కంటే కూడా సాయి పల్లవికే ఎక్కువ మార్కులు పడ్డాయి. పూర్తిగా తెలంగాణ యాసలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవి.. మరింత ఆకట్టుకుంది. నిజానికి ఫిదా కంటే ముందే ప్రేమమ్ చేసినా.. సాయిపల్లవికి ఫిదా తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చింది. అందుకే అమ్మడికి శేఖర్ కమ్ముల అంటే స్పెషల్ రెస్పెక్ట్. ఈ కారణంగా అని చెప్పలేం కానీ.. మరోసారి సాయి పల్లవి.. శేఖర్ సినిమాలో నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి.

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల ఏ కొత్త సినిమా ప్రారంభించలేదు. కానీ ఓ కథపై ఇన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. మరోవైపు కొన్నాళ్లుగా రూమర్స్ గా ఉన్న ఓ వార్త నిజమే అనేది లేటెస్ట్ న్యూస్. కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధృవ్ తో శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నాడనేదే ఆ వార్త. అది నిజమే అని ఖచ్చితంగా వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాను బై లింగ్వుల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ధృవ్ సరసనే సాయి పల్లవి హీరోయిన్ గా నటించాల్సి ఉంటుంది. మరి అందుకు తను ఒప్పుకుంటుందా అనేది చూడాలి.

కాకపోతే మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తారట మేకర్స్.. ఇక ప్రస్తుతం ధృవ్ కోలీవుడ్ లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి రీమేక్ ‘వర్మ’ తో అక్కడ డెబ్యూ ఇస్తున్నాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల సినిమా ఉంటుంది. అంటే ఫస్ట్ మూవీ రగ్ డ్ అండ్ మాసీగా ఉంటే నెక్ట్స్ మూవీ వెంటనే క్లాసీగా ఉంటుందన్నమాట. మొత్తంగా ఫిదా బ్యూటీ శేఖర్ కు మళ్లీ ఓకే చెబుతుందా అనేదే ఇప్పుడు హాటెస్ట్ డౌట్. 

More Related Stories