English   

అనసూయ, రష్మిలతో శేఖర్ మాస్టర్ సినిమా.. ఆయనొస్తే అంతే అంటూ 

Anasuya Rashmi
2020-08-12 09:01:08

అనసూయ భరద్వాజ్, రష్మిలు ఇద్దరూ జబర్దస్త్ నుండి ఫేమస్ అయిన వాళ్ళే. హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో వీళ్ళకి కూడా అంత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ టెలివిజన్ యాంకరింగ్ లో లీడింగ్ లో ఉన్నారు, అడపదపా సినిమాలు కూడా చేస్తూ తమ టాలెంట్ చాటుకుంటున్నారు. ఇక శేఖర్ మాస్టర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరియోగ్రఫర్ అయిన ఈయన కూడా డీ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. బుల్లితెరపై మనోడు యాంకర్లతో చేసే సరస సల్లాపాలతో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. 

అయితే అనసూయ భరద్వాజ్, రష్మిలు హీరోయిన్స్ గా, శేఖర్ మాస్టర్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే అది నిజం సినిమా కాదండోయ్. డమ్మీ సినిమా, అసలు విషయం ఏంటంటే అనసూయ భరద్వాజ్, రష్మి, శేకర్ మాస్టర్, హైపర్ ఆదిలు సుమక్క క్యాష్ ఎపిసోడ్‌ కు వచ్చారు. ఈ క్రమంలోనే ఎప్పటిలానే ఆది శేఖర్ మాస్టర్‌ను టార్గెట్ చేసి కొన్ని పంచులు వేసాడు. అక్కడే ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. అనసూయ, రష్మి హీరోయిన్లుగా శేఖర్ మాస్టర్ హీరోగా సినిమా చేస్తే దానికి టైటిల్ ఏంటి అని అడగ్గానే హైపర్ ఆది "ఆయనొస్తే అంతే" అంటూ ఒక టైటిల్ పెట్టేసాడు. అది డబుల్ మీనింగ్ డైలాగ్ కావడంతో గట్టిగానే పేలింది. 

More Related Stories