English   

కల్యాణీ రీఎంట్రీ..యంగ్ హీరోతో సినిమా

 Kalyani
2021-05-01 18:04:40

రాజ‌శేఖర్ హీరోగా న‌టించిన శేషు సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ క‌ల్యాణి. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ వెంట‌నే ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు సినిమాతో మ‌రో హిట్ అందుకుంది. ఆ త‌ర‌వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ నటించి అల‌రించింది. చూడ్డానికి తెలుగ‌మ్మాయిలా క‌నిపించే క‌ల్యాణి తెలుగు ప్రేక్ష‌కులకు ఎంతో ద‌గ్గ‌రైంది. హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గిన త‌ర‌వాత క‌ల్యాణి సినిమాల్లో వ‌దిన‌, అక్క క్యారెక్టర్లు చేస్తూ అల‌రించింది. 

తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో న‌టించిన క‌ల్యాణి అవ‌కాశాలు త‌గ్గ‌ముఖం ప‌ట్ట‌డంతో సినిమాల‌కు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. ఆ త‌ర‌వాత సంసార జీవితంలో బిజీగా ఉంటూ భ‌ర్త‌తో క‌లిసి ఓ నిర్మాణ సంస్థ‌ను కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడు క‌ల్యాణి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ట‌. కానీ న‌టిగా కాదు ఈ సారి ద‌ర్శ‌కురాలిగా రీఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ట‌. 

త‌న సొంత నిర్మాణంలోనే కల్యాణి ఈ సినిమా చేయ‌బోతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. అంతే కాకుండా ఈ సినిమాతో చేత‌న్ శ్రీను అనే కొత్త హీరోను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌బోతుంది క‌ల్యాణి. హోలీ పండ‌గ సంధ‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఎంత‌గానో అక‌ట్టుకుంది. ఇక క‌రోనా ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రాగానే ఈ సినిమా షూటింగ్  ను ప్రారంభించ‌నున్నట్టు తెలుస్తుంది. 

More Related Stories