English   

సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ లా ఉన్నాడే..?

officer movie- nagarjuna
2018-02-27 21:01:20

నాగార్జున ఆఫీస‌ర్ అయిపోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా ఉన్న ఈయ‌న ఇప్పుడు ఆఫీస‌ర్ అంటున్నాడు. వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఫిబ్ర‌వ‌రి 25నే ప్లాన్ చేసినా కూడా ఆ రోజు శ్రీ‌దేవి చ‌నిపోవ‌డంతో బ‌య‌టికి రాలేదు. ఇప్పుడు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసాడు వ‌ర్మ‌. ప్ర‌స్తుతానికి ఈ చిత్ర షూటింగ్ ముంబైలోనే జ‌రుగుతుంది. కానీ శ్రీ‌దేవి కార‌ణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే ఫ‌స్ట్ లుక్ మాత్రం విడుద‌ల చేసాడు. మోష‌న్ పోస్ట‌ర్ చూస్తుంటే ప‌క్కా సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా ఉన్నాడు అని తెలుస్తుంది. స‌మాజంలో ఉన్న కుళ్లును ఏరి పారేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు నాగార్జున‌. పైగా పోలీసులు దేనికి భ‌య‌ప‌డ‌రంటూ బ్యాగ్రౌండ్ లో ఓ మాట కూడా విన‌బ‌డుతుంది. ఈ చిత్రానికి టైటిల్ పై కొన్ని వార్త‌లు వినిపించినా చివ‌రికి ఆఫీస‌ర్ అనే టైటిల్ నే క‌న్ఫ‌ర్మ్ చేసాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. గ‌న్ అనే టైటిల్ తో పాటు సిస్ట‌మ్, శ‌ప‌థం లాంటి టైటిల్స్ కూడా ఆలోచించాడు వ‌ర్మ‌. కానీ ఇప్పుడు అవ‌న్నీ కాద‌ని ఆఫీస‌ర్ అంటున్నాడు. ఈ సినిమా మే 25న విడుద‌ల కానుంద‌ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసాడు కూడా. మార్చ్ 30తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. మ‌రి చూడాలిక‌.. పాతికేళ్ళ త‌ర్వాత ఈ జోడీ క‌లిసి ఏం మాయ చేయ‌బోతున్నారో..?

More Related Stories