English   

షూటింగ్ స్పాట్ లో నటి మీద హెయిర్ డ్రెస్సర్ దాడి

Raga Madhuri
2019-06-19 11:48:12

షూటింగ్ స్పాట్ లో ఫైటింగ్ జరిగడం మామూలే, కానీ అదే నిజంగా ఫైటింగ్ జరిగితే తాజాగా అదే జరిగింది. సీరియల్ నటి రాగ మాధురి పై ఆమె హెయిర్ డ్రెస్స్సర్ జ్యోతి తన అనుచరులతో దాడికి దిగింది. ఈ ఘటనకి సంబందించిన పూర్తి  వివరాల్లోకి వెళితే  బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఆ సీరియల్ లో నటిస్తున్న రాగమాధురి నల్లపూసల గొలుసు రెండురోజుల క్రితం కనిపించకుండా పోయింది. ఈ విషయం మీద సెట్ లోని సభ్యులను ఆమె ఆరా తీసినా, సెట్ అంతా వెదికినా ఫలితం లేదు. దీంతో రాగమాధురి షూటింగ్ స్పాట్‌లో చైన్ పోయిందని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా అని అడిగితే ఆమె జ్యోతి పేరు చెప్పింది. దీంతో పోలీసులు జ్యోతి ని స్టేషన్ కి పిలిపించారు. ఇంతలో క్యాబ్ డ్రైవర్ వచ్చి చైన్ దొరికిందని పోలీసులకు ఇచ్చారు. అసలు విషయం తెలిసింది ఇక జ్యోతి షూటింగ్ కి వెళ్ళిపోయింది. రాగ మాధురి కూడా కేసు వాపసు తీసుకొని షూటింగ్ కి వెళ్ళింది. ఇది అవమానంగా భావించిన జ్యోతి తన వాళ్ళకి కాల్ చేసి పిలిపించి వారితో కలిసి రాగమాధురిపై దాడికి పాల్పడ్డారు. ఎలాగో ఆ దాడిని తప్పించుకొని మళ్ళీ పోలీసులను ఆశ్రయంచింది రాగమాధురి. ఈ ఫిర్యాదు మేరకు జ్యోతి, ఆమె కూడా వచ్చిన వారి మీద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Related Stories