షాదీ ముబారక్ రివ్యూ

నటీనటులు : వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్, ప్రియదర్శి రామ్, హేమంత్, శత్రు, భద్రమ్, మధునందన్, అదితి, అజయ్ ఘోష్ తదితరులు
ఎడిటర్ : మధు
సంగీతం : సునీల్ కశ్యప్
కెమెరా : శ్రీకాంత్ నారోజ్
నిర్మాతలు : దిల్‌రాజు, శిరీష్
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : పద్మశ్రీ
కథ:
సున్నిపెంట మాధవ్(వీర్‌సాగర్) ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు పెళ్లి చూపుల కోసం వస్తాడు. ఈ క్రమంలో ఆ మ్యారేజ్ బ్యూరోను నిర్వహించే మహిళ మాధవ్‌ను పెళ్లి చూపులకు తీసుకెళ్లే బాధ్యతలను తన కుమార్తె సత్యభామకు అప్పగిస్తుంది.ఈ ప్రయాణంలో మాధవ్, సత్యభామలకు ఒకరి గురించి ఒకరికి తెలిసే నిజాలేంటి? ఒకరిపై ఒకరు మనసుపడ్డ మాధవ్, సత్యభామ ఎలా ఒకటవుతారు? అనేది కథ..
కథనం:
ఫస్ట్ హాఫ్ అంతా ఒక కారులోనే కథను నడిపిస్తూ.. అది కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు పద్మశ్రీ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. అబ్బాయి, అమ్మాయి కలిసి చేసే ప్రయాణంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడటం.. అది పెళ్లిగా ఎలా దారి తీసిందనే, అందరికీ తెలిసిన లవ్స్టోరినీ ఎంటర్టైనింగ్గా చక్కగా మలిచాడు దర్శకుడు. సన్నివేశాలను డీవియేట్ చేయనీయకుండా చక్కటి డైలాగ్స్‌తో ఎక్కడా బోర్ అనిపించకుండా సినిమా సాగుతుంది. కామెడీ డైలాగ్స్‌తో పాటు ప్రేమ, పెళ్లి గొప్పతనాన్ని గురించి చెప్పే సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. హీరో స్నేహితుడిగా భద్రమ్ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. సెకండాఫ్ లో ఆర్.జె.హేమంత్ తన వంతుగా నవ్వించాడు.
నటీనటులు:
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన వీర్‌సాగర్ లుక్ పరంగా బాగా ఉన్నాడు. కథా పరంగా డిజైన్ చేసిన తన పాత్రలోని కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ దృశ్యా రఘునాథ్.. తొలి సినిమానే అయినా, నటనతో చక్కగా ఆకట్టుకుంది. డ్రైవర్ రమేష్ పాత్రలో రాహుల్ రామకృష్ణ ఒదిగిపోయాడు. భార్య, బావ మరిదితో ఫోన్లో మాట్లాడే సన్నివేశాలు ప్రేక్షకుడికి కనెక్ట్ చేస్తాయి. పెళ్లి సంబంధాలు చూసే వ్యక్తి పాత్రలో ఆర్.జె.హేమంత్ తన వంతుగా నవ్వించాడు.
సాంకేతిక విభాగం:
ముందుగా దర్శకుడు పద్మశ్రీ విషయానికి వస్తే అందరికీ తెలిసిన లవ్స్టోరినీ ఎంటర్టైనింగ్గా చక్కగా మలిచాడు. సన్నివేశాలను డీవియేట్ చేయనీయకుండా చక్కటి డైలాగ్స్‌తో ఎక్కడా బోర్ అనిపించకుండా సినిమా సాగుతుంది. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగుంది. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ,మధు ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
చివరగా.. ‘షాదీ ముబారక్'..బోర్ కొట్టకుండా ఆకట్టుకునే లవ్ స్టోరీ!!
రేటింగ్: 3/5.