English   

షారుక్ ఖాన్ రేంజ్ అంత దారుణ‌మా..? 

Shah-Rukh-Khan
2018-12-06 09:47:43

హిట్టు లేక‌పోతే ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఇప్పుడు షారుక్ ఖాన్ ప‌రిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. ఒక‌ప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోయిన ఈ హీరో.. ఇప్పుడు ఒక్క హిట్ అంటూ చూస్తున్నాడు. దానికంటే విచిత్రం ఏంటంటే ఈయ‌న ఫోర్బ్స్ లిస్ట్ టాప్ 10లో చోటు కూడా కోల్పోవడం. కొన్నేళ్ళుగా ఫోర్బ్స్ ఇండియా టాప్ 10లోనే చోటు ద‌క్కించుకుంటూ వ‌స్తున్న షారుక్ ఖాన్ ఇప్పుడు అది కూడా కోల్పోయాడు. అస‌లు కింగ్ ఖాన్ పేరు అందులో లేక‌పోవ‌డం ఏంటో అభిమానులకు అర్థం కావ‌డం లేదు. ఏదో జీరో టైటిల్ తో సినిమా చేస్తున్నాడ‌ని నిజంగానే ఇప్పుడు ఈ హీరోను జీరో అనుకుంటే ఎలా..? ఈయ‌న సంపాద‌న అంత దారుణంగా ప‌డిపోయిందా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. యాడ్స్ నుంచే కోట్ల‌కు కోట్లు వెన‌కేసుకునే కింగ్ ఖాన్.. ఇప్పుడు సినిమాల నుంచి అస్స‌లు సంపాదించ‌డం లేదా..? ఒక‌టి రెండు కాదు ఏకంగా 13వ స్థానంలో ఉన్నాడు షారుక్ ఖాన్. ఈయ‌న సంపాద‌న 56 కోట్లు మాత్ర‌మే. ఒక‌ప్పుడు ఏడాదికి 200 కోట్లుండే సంపాద‌న కాస్త ఇప్పుడు 50ల్లోకి వ‌చ్చేసింది. ఆయ‌న కంటే ముందు అక్ష‌య్ కుమార్, అమీర్ ఖాన్. అజ‌య్ దేవ్ గ‌న్, స‌ల్మాన్ లాంటి హీరోలున్నారు. ఒక‌ప్పుడు షారుక్ కంటే చాలా వెన‌క‌బ‌డి ఉన్న హీరోలు కూడా ఇప్పుడు స‌త్తా చూపిస్తుంటే షారుక్ మాత్రం అలా వేడుక చూస్తుండిపోతున్నాడు. ముఖ్యంగా డిసెంబ‌ర్ 21న రానున్న జీరో కానీ ఆడ‌లేదంటే షారుక్ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ప‌డిపోవ‌డం ఖాయం. 

More Related Stories