English   

అత‌డికే ఫిక్స్ అయిన అర్జున్ రెడ్డి.. 

Shahid-Kapoor

అర్జున్ రెడ్డి అనేది సినిమా కాదు.. అదో బ్రాండ్. యూత్ కు ఈ చిత్రం ఎంత‌లా ఎక్కేసిందంటే.. ప‌గ‌లు రాత్రి అప్ప‌ట్లో అర్జున్ రెడ్డి ధ్యాస‌లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అర్జున్ రెడ్డి అంటారే కానీ సొంత పేరుతో పిల‌వ‌డం మ‌రిచిపోయారు. అంత‌గా ఫేమ‌స్ అయ్యాడు ఈ సినిమాతో. ఇక ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. అక్క‌డ షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇన్నాళ్లూ ఈ సినిమాపై కేవ‌లం అనుమానాలు మాత్ర‌మే ఉన్నాయి. ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. తాజాగా ఈ చిత్రం చేయ‌బోతున్న‌ట్లు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసారు. ఇక షాహిద్ కూడా త‌న ద‌ర్శ‌కుడితో ఫోటో దిగి ట్విట్ట‌ర్ లో పెట్టుకున్నాడు. అర్జున్ రెడ్డి ఇప్ప‌టికే బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో అక్క‌డ ఈ చిత్రం అంటే ఇంకో రేంజ్ లో ఉంటుంద‌నే అంచ‌నాలున్నాయి. పైగా తెలుగులో సెన్సార్ కు బ‌లైపోయిన సీన్స్ కూడా అక్క‌డ తెర‌కెక్కిస్తాడు సందీప్ రెడ్డి వంగా. దానికితోడు షాహిద్ లాంటి న‌టుడు తోడైతే ఆ ర‌చ్చ మ‌రో రేంజ్ లో ఉంటుంది. అస‌లే ఈయ‌న క‌మీనే.. ఉడ్తాపంజాబ్ లాంటి సినిమాల్లో అదిరిపోయే యాక్ష‌న్ చేసాడు. ఇప్పుడు అలాంటి వాడికి అర్జున్ రెడ్డి త‌గిలితే అరాచ‌క‌మే.

More Related Stories