English   

అల్లుడిపై శైలాజారెడ్డికి అంత కోపమేంటో..?

Shailaja-Reddy

అక్కినేని నాగచైతన్య, అనూ ఇమ్మానుయేల్ జంటగా రూపొందుతోన్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక శైలజారెడ్డిగా రాజమాత రమ్యకృష్ణ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కు కొత్త ఊపు వచ్చింది. ఇక ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ట్రెడిషనల్ డ్రెస్ లో చైతూ, అనూ ఇమ్మానుయేల్ రొమాంటిక్ గా ఓ కుర్చీని ఆనుకుని ఉంటే.. అదే కుర్చీలో ఉన్న రమ్యకృష్ణ ఆ ఇద్దరి వైపు కోపంగా చూస్తున్నట్టు ఉన్న ఫోటో విడుదల చేశారు. దీంతో పాటు చైతూ సోలో స్టిల్ కూడా ఒకటి వదిలారు. అయితే రమ్యకృష్ణతో ఉన్న స్టిల్ మాత్రం ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి ఆమెకు అల్లుడంటే పెద్దగా ఇష్టం లేదని అర్థమౌతోంది.  అత్తా, అల్లుడు నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు తెలుగులో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఆ ఇద్దరి మధ్య వైరం హిట్ ఫార్ములాగా ఎప్పుడో ప్రూవ్ అయింది. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ లాంటి అత్తతో సాఫ్ట్ గా కనిపిస్తోన్న అల్లుడు చైతూ ఎలా వేగుతాడు.. లేదా అత్తను ఎలా ఢీ కొంటాడు అనేది కథలో పాయింట్ గా ఈజీగా అర్థమైపోతోంది. ఇక ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

More Related Stories