English   

అల్లుడికి బాగా క‌నెక్ట్ అయ్యారు

Shailaja Reddy Alludu Teaser Trending in Youtube
2018-08-03 08:13:35

శైల‌జారెడ్డి అల్లుడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. నాగ‌చైత‌న్య హీరోగా మారుతి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయ‌ని తెలుసు. కానీ ఇంత‌గా ఉన్నాయ‌ని మాత్రం ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుంది. ఈ చిత్ర టీజ‌ర్ కు తొలిరోజే 10 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. మారుతి బ్రాండ్ కు తోడు చైతూ ఇమేజ్ కూడా ఈ చిత్రానికి బాగానే ప్ల‌స్ అవుతుంది. అన్నింటికీ మించి ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టిస్తుండ‌టంతో సినిమా ఎలా ఉండ‌బోతుందా అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది.

దానికితోడు టాప్ టూ బాట‌మ్ నాగ‌చైత‌న్య లుక్ కూడా మారిపోయింది. టీజ‌ర్ పూర్తిగా మాస్ ట‌చ్ లో ఉండ‌టంతో వెంట‌నే క‌నెక్ట్ అయిపోయింది. అను ఎమ్మాన్యువ‌ల్ ఇందులో చైతూకు జోడీగా న‌టిస్తుంది. ఇగో ఎక్కువ‌గా ఉన్న అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది ఈమె. హీరోయిన్ కంటే ఆమె అమ్మ‌కు మ‌రో రెండు ట‌న్నులు ఇగో ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఇద్ద‌రి ఇగోను హీరో ఎలా అణిచాడు అనేది క‌థ‌. ఆగ‌స్ట్ 31న ఈ చిత్రం విడుద‌ల కానుంది. చైతూ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ బిజినెస్ చేస్తోన్న సినిమాగా శైల‌జారెడ్డి అల్లుడు రికార్డ్స్ సృష్టిస్తున్నాడు.

More Related Stories