English   

స‌మంత‌ను మ‌రిచిపోయిన నాగ‌చైత‌న్య‌.. 

samantha-vs-naga-chaitanya
2018-08-23 16:52:00

అదేంటి.. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ లో హీరో నాని క‌దా.. ఇప్పుడు ఆ జ‌బ్బు కానీ నాగ‌చైత‌న్య‌కు వ‌చ్చిందా ఏంటి..? ఎంతైనా ఇప్పుడు మారుతితో ప‌ని చేసాడు కదా అలా మారిపోయాడేమో అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు కానీ ఈయ‌న కూడా ఇప్పుడు గ‌జిని అయిపోయిన‌ట్లున్నాడు. లేదా అయిన‌ట్లు న‌టిస్తున్నట్టున్నాడు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఎందుకంటే శైల‌జారెడ్డి అల్లుడు వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ముందు ఆగ‌స్ట్ 31 అనుకున్న తేదీ కాస్తా రెండు వారాలు ఆల‌స్యంగా వ‌స్తుంది. అయితే త‌న సినిమాను విడుద‌ల చేయాల‌నే కంగారులో భార్య స‌మంత‌నే మ‌రిచిపోయాడు నాగ‌చైత‌న్య‌. 

ఈమె సినిమా కూడా అదే రోజు విడుద‌ల కానుంది. యు ట‌ర్న్ సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంద‌ని ఎప్ప‌ట్నుంచో అనౌన్స్ చేస్తూనే ఉంది స‌మంత‌. కానీ ఇప్పుడు అల్లుడు కూడా వ‌చ్చి అదేరోజు ప‌డ‌టంతో ఏం చేయాలో ఈ భామ‌కు కూడా అర్థం కావ‌డం లేదు. ఈ విష‌యంలో చైతూ కూడా చాలా తెలివిగా త‌ప్పించుకున్నాడు. త‌న‌కేం సంబంధం లేద‌ని.. కేవ‌లం నిర్మాత‌లే ఈ కొత్త తేదీ అనౌన్స్ చేసార‌ని చెబుతున్నాడు. మొత్తానికి ఏదేమైనా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.  భార్య‌తో పోటీకి సిద్ధ‌మైపోయాడు చైతూ. ఇంక ఇప్పుడు త‌ల‌నొప్పంతా స‌మంత‌కే.. చైతూ రిలాక్స్ అయిపోతున్నాడు. 

More Related Stories