English   

జూలై 9న శైల‌జారెడ్డి అల్లుడిని చూపిస్తార‌ట‌..!!

shailajareddyalludu

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య చాలా స్పీడ్ పెంచాడు. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోత‌న్నాడు. ప్రేమ‌మ్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత రూట్ మార్చిన చైతూ.. త‌ర్వాత రారండోయ్ వేడుక చూద్దాంతో మ‌రో హిట్అందుకున్నాడు. యుద్ధం శ‌ర‌ణం దెబ్బ కొట్టినా.. ఇప్పుడు వ‌రుస‌గా రెండు సినిమాల‌తో రాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటితో క‌లిసి స‌వ్య‌సాచి చేశాడు. ఇది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. అలాగే మారుతి ద‌ర్శ‌క‌త్వ‌లో శైల‌జా రెడ్డి అల్లుడు ఎప్ప‌టి నుంచో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ మూవీపై ఇప్ప‌టికే చాలా అంచనాలున్నాయి. అటు మారుతి వ‌రుస విజ‌యాల‌తో ఉండ‌టం కూడా శైల‌జారెడ్డి అల్లుడికి ప్ల‌స్ అవుతోంది. అన్నిటికంటే శైల‌జారెడ్డిగా ర‌మ్య‌క్రుష్ణ న‌టిస్తోంది. ఇక నాగ చైతన్య స‌ర‌స‌న అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను ఈ నెల 9న విడుద‌ల చేయ‌బోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి చైతూది ఓ లుక్ లీక్ అయింది. కానీ అది ఆ సినిమాలోనిది కాద‌న్నారు. బ‌ట్ ఇంకా లేట్ చేస్తే ఇంకేం లీక్ అవుతాయ‌నుకున్నారో.. మొత్తంగా కొత్త లుక్ కు ముహూర్తం సెట్ చేసుకున్నారు. మ‌రి ఈ ఫ‌స్ట్ లుక్ లో ఎవ‌రెవ‌రుంటారో చూడాలి. 

More Related Stories