English   

ప‌వ‌న్ ను దించేసిన శంక‌ర్..

Shakalaka Shankar imitating pavan kalyan
2018-06-09 11:28:49

శంక‌ర్ అంటే ఇక్క‌డ ద‌ర్శ‌కుడు కాదు.. మ‌న ద‌గ్గ‌ర ఉన్నాడు క‌దా క‌మెడియ‌న్ శక‌ల‌క శంక‌ర్. ఈయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అభిమాని కాదు భ‌క్తుడు. ఆయ‌న కోసం గుడి కూడా క‌డుతున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇలాంటి వాడు ఇప్పుడు హీరో అయ్యాడు. ఈయ‌న్ని హీరోగా పెట్టి తోటి జ‌బ‌ర్ద‌స్థ్ క‌మెడి య‌న్ శ్రీ‌ధ‌ర్ శంభో శంక‌ర సినిమా చేస్తున్నాడు. సురేష్ కొండేటి నిర్మాత‌. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత అంతా షాక్ అవుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు దూరంగా ఉన్నాడ‌ని శంక‌ర్ ను పంపించాడా ఏంటి అన్న‌ట్లుగా ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ని దించేసాడు శంక‌ర్. ఇండ‌స్ట్రీలో ఆల్రెడీ ఓ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉండ‌గా.. మ‌ళ్లీ ఇప్పుడు ఎందుకు శంక‌ర్ ఇంత‌గా ప‌వ‌న్ ను వాడుకోవ‌డం..? అభిమాని అయితే ఓకే కానీ మ‌రీ ఇంత‌గా దించేస్తే ఎలా..? ప‌వ‌న్ లా చేయ‌డానికి ఆయ‌నే ఉన్నాడుక‌దా.. మ‌రో హీరో ఎందుకు..? ఇంత చిన్న లాజిక్ ఎలా మ‌ర్చిపోయాడు శంక‌ర్..? అస‌లే చిన్న సినిమా.. ఆపై ఇలాంటి కాపీ ముద్ర‌లు ప‌డితే సినిమాకే మోసం రాక త‌ప్ప‌దు. టీజ‌ర్ చూస్తుంటే అంతంత‌మాత్రంగానే ఉంది. పైగా ప‌వ‌న్ ఇమిటేష‌న్.. ఇన్నింటి మ‌ధ్య శంక‌ర్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలిక‌..!

More Related Stories