English   

ప‌వ‌న్ కొట్ట‌లేదంటోన్న క‌మెడియ‌న్.. 

shakalaka shankar

ష‌క‌ల‌క శంక‌ర్.. కొన్ని రోజులుగా ఈ పేరు మీడియాలో బాగా వినిపిస్తుంది. దానికి కార‌ణం ఈయ‌న హీరోగా ఓ సినిమా చేయ‌డ‌మే. శంభో శంక‌ర అంటూ త‌న పేరు మీదే ఓ సినిమా చేసాడు ఈ క‌మెడియ‌న్. అప్ప‌ట్లో జ‌బ‌ర్ద‌స్థ్ కామెడీ షోలో ఈ పేరు బాగా పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ అభిమానిగా.. కాదు కాదు భ‌క్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారి షాక్ ఇచ్చాడు. గ‌త వారం ఈ చిత్రం విడుద‌లైంది. వ‌చ్చెళ్లిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. అలాంటి సినిమాతో వ‌చ్చాడు ఈ క‌మెడియ‌న్. పాత క‌థ‌నే తీసుకుని ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు శంక‌ర్. అయితే ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే స‌ర్దార్ స‌మ‌యంలో జ‌రిగిన విష‌యాల‌ను కూడా గుర్తు చేసుకున్నాడు శంక‌ర్.  

ఈ విష‌యంపై మాట్లాడిన ఈ క‌మెడియ‌న్.. స‌ర్దార్ సెట్ లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఒక‌రు మాటిమాటికి తీసిన సీన్సే తీస్తుంటే చిరాకు ప‌డ్డాన‌ని.. ప‌వ‌న్ దానికి నిర్మాత కాబ‌ట్టి ఆయ‌న డ‌బ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అనే బాధ‌తోనే అలా అన్నాన‌ని చెప్పాడు శంక‌ర్. కానీ ఆ త‌ర్వాత ప‌వ‌న్ వ‌చ్చి అప్పుడే ద‌ర్శ‌కుల‌కు చెప్పే స్థాయికి వ‌చ్చావా అంటూ తిట్టార‌ని చెప్పాడు శంక‌ర్. కానీ ఇందులో సీన్ మాత్రం మ‌రోలా జ‌రిగింద‌ని అక్క‌డ ఉన్న‌వాళ్లు అప్ప‌ట్లో చెప్పిన మాట‌. సెట్ లో శంక‌ర్ చేసిన ఎక్స్ ట్రాలు చూసి ప‌వ‌న్ కోప్ప‌డ‌టం కాదు.. కొట్టారంటారు. కానీ ఇప్పుడు సీన్ మాత్రం మ‌రోలా మార్చుకున్నాడు ఈయ‌న‌. మొత్తానికి నిజ‌మేంటో మ‌రి ప‌వ‌న్, శంక‌ర్ ల‌కే తెలియాలిక‌..

More Related Stories