English   

అయ్యో.. అర్జున్ రెడ్డి బ్యూటీ ఇలా అయిందేంటీ..?

Shalini-pandey

అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన బ్యూటీ షాలినీ పాండే. ఆ సినిమా తర్వాత ఎన్నో చాన్సులు వస్తాయనుకున్న షాలినిని మనాళ్లెవరూ పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ కు వెళ్లింది. అక్కడ ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తోంది.  తెలుగులో లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. అయితే అమ్మడు బాలీవుడ్ కూ వెళ్లింది. ఈ సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇక్కడ లీడ్ హీరోయిన్ గా ఎంతోమందిని మెస్మరైజ్ చేసిన షాలిని అక్కడ హీరోయిన్ కు ఫ్రెండ్ అని కూడా చెప్పలేని పాత్రలో నటిస్తోంది. ఇంకా చెప్పాలంటే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆ మూవీ ట్రైలర్ లో అమ్మడు ఒక్కటంటే ఒక్క షాట్ లోనే కనిపిస్తోంది. అది కూడా హీరోయిన్ ను పెళ్లి చూపులకు తీసుకువచ్చే ఫ్రెండ్స్ గుంపులో నుంచి. బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఆనంద్ ఎల్ రాయ్ ఒకడు. అతను నిర్మాతగా మారి తెరకెక్కిస్తోన్న సినిమా ‘మేరీ నిమ్మో’. ఈ సినిమాలోనే షాలిని చిన్న పాత్రలో కనిపించింది. దీన్ని పాత్ర అనే కంటే షాట్ అంటే బెటరేమో. తెలుగులో 2013లో వచ్చిన నేషనల్ అవార్డ్ ఫిలిమ్ నా బంగారు తల్లిలో ప్రధాన పాత్రలో నటించిన అంజలీ పాటిల్ ఈ సినిమాలో హీరోయిన్ కావడం విశేషం. ఓ చిన్న పిల్లాడి క్రష్ చుట్టూ తిరిగే ఈ కథ ఆకట్టుకునేలానే ఉంది. ట్రైలర్ కు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కానీ అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో స్టార్ హీరోలను సైతం ఆకట్టుకుంది. అంటే షాలినిపాండే అక్కడి వారికీ బానే తెలిసుండాలి. అయినా ఇలాంటి చిన్న ‘షాట్’లో కనిపించిందంటే ఆశ్చర్యమే. 

More Related Stories