English   

అర్జున్ రెడ్డి పోరీ అస్స‌లు ఆగ‌ట్లేదుగా..!

shalini-pandey
2018-04-25 18:01:52

అవును.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల‌కు హార్ట్ ఎటాక్ తెప్పించేసింది శాలిని పాండే. అర్జున్ రెడ్డిలో ముద్దుల్లో ముంచెత్తి కుర్రాళ్ల‌ను ఊపిరి ఆడ‌కుండా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. బేసిక్ గానే థియేట‌ర్ ఆర్టిస్ట్ కావ‌డంతో ఎక్స్ ప్రెష‌న్స్ తోనే చంపేసింది. అర్జున్ రెడ్డితో అంద‌ర్నీ ఫిదా చేసింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ భామ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోతుంది. తెలుగులో వ‌ర‌స‌గా సినిమాలు ఒప్పు కుంటూ దూసుకెళ్తుంది శాలిని పాండే. తాజాగా క‌ళ్యాణ్ రామ్-గుహ‌న్ సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇదే సినిమాలో నివేదా మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇక దాంతోపాటు త‌మిళ‌నాట 100 ప‌ర్సెంట్ ల‌వ్ సినిమా రీమేక్ లో ఈ భామే న‌టిస్తుంది. ఇందులో ముందు లావ‌ణ్య త్రిపాఠిని తీసుకున్నారు. కానీ ఆమెను త‌ప్పించి షాలిని పాండేనే హీరోయిన్ గా తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 100 ప‌ర్సెంట్ ల‌వ్ రీమేక్ తో పాటు మ‌హాన‌టిలోనూ న‌టిస్తుంది షాలిని పాండే. సావిత్రి బ‌యోపిక్ గా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడు. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇందులో షాలిని పాండే పోషించే పాత్రేంటి..? ఎవ‌రి కారెక్ట‌ర్ లో ఈమె క‌నిపించ‌బోతుంద‌నే విష‌యాలు మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఈ మ‌ధ్యే దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ సినిమాలో న‌టించ‌బోతుంది షాలిని పాండే. ఏఎస్ కార్తిక్ తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ కి జోడీగా న‌టించ‌బోతుంది ఈ బ్యూటీ. మొత్తానికి అర్జున్ రెడ్డి పాప అస‌లు ఆగ‌ట్లేదిప్ప‌డు.

More Related Stories