English   

అర్జున్ రెడ్డి పాప అన్నీ చూపిస్తుందిగా.. 

Shalini-Pandey

అన్నీ అంటే అందాల‌ని కాదండీ బాబూ.. అన్ని టాలెంట్స్ చూపిస్తుందిగా అని. అవును.. వ‌చ్చీ రావ‌డంతోనే తెలుగు ప్రేక్ష‌కుల్ని.. మ‌రీ ముఖ్యంగా కుర్రాళ్ల‌ను త‌న చూపుల‌తో ప‌డేసింది శాలిని పాండే. థియేట‌ర్ ఆర్టిస్ట్ కావ‌డంతో ఎక్స్ ప్రెష‌న్స్ తోనే చంపేసింది. అర్జున్ రెడ్డితో అంద‌ర్నీ ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు త‌న‌లోని ఒక్కో టాలెంట్ ను బ‌య‌టికి తీస్తుంది షాలిని పాండే. తాజాగా ఈ భామ గాయ‌కురాలిగా మారింది. నా ప్రాణ‌మే అంటూ ఓ రాక్ బ్యాండ్ తో క‌లిసి ప్రైవేట్ ఆల్బమ్ లో పాడింది. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న ఇది విడుద‌ల కానుంది. ఇప్ప‌టికి వ‌చ్చిన టీజ‌ర్ లో మాత్రం ఒకే లైన్ తో మెస్మ‌రైజ్ చేసింది షాలిని పాండే. ఇంత త్వ‌ర‌గా తెలుగు నేర్చుకుని మ‌రీ ఇక్క‌డ పాట పాడ‌టం అద్భుత‌మే. మ‌రోవైపు సినిమాల‌తోనూ బిజీగా ఉంది శాలిని. 

త‌మిళ‌నాట 100 ప‌ర్సెంట్ ల‌వ్ సినిమా రీమేక్ లో ఈ భామే న‌టిస్తుంది. ఈ చిత్రంలో ముందు లావ‌ణ్య త్రిపాఠిని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెను త‌ప్పించి షాలిని పాండేనే హీరోయిన్ గా తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 100 ప‌ర్సెంట్ ల‌వ్ రీమేక్ తో పాటు మ‌హాన‌టిలోనూ న‌టిస్తుంది షాలిని పాండే. సావిత్రి బ‌యోపిక్ గా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడు. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇందులో షాలిని పోషించే పాత్రేంటి..? ఎవ‌రి కారెక్ట‌ర్ లో ఈమె క‌నిపించ‌బోతుంద‌నే విష‌యాలు మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఈ మ‌ధ్యే దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ సినిమాలో న‌టించ‌బోతుంది షాలిని పాండే. ఏఎస్ కార్తిక్ తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ కి జోడీగా న‌టించ‌బోతుంది ఈ బ్యూటీ. మొత్తానికి అర్జున్ రెడ్డి పాప అన్నీ టాలెంట్స్ ఒకేసారి చూపించేస్తుంది. 

More Related Stories