English   

 ఓయ్.. తొమ్మిదేళ్ల త‌ర్వాత వ‌స్తున్నావా..? 

Shamili-Ammagaarillu

షామిలి.. ఈ పేరంటే పెద్ద‌గా ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌రు. కానీ బేబీ షామిలి అంటే ఈజీగా గుర్తు ప‌ట్టేస్తారు. చిన్న‌పుడు త‌న ప‌ర్ఫార్మెన్స్ తో అంద‌రిని మాయ చేసింది ఆ చిన్నారి. త‌ర్వాత 15 ఏళ్ళ పాటు ఎవ‌రికీ క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ 2009లో స‌డ‌న్ గా పెద్దై ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది. మ‌ళ్లీ మాయమైపోయింది. ఈ క‌థంతా షామిలి గురించే.. మ‌న‌కు ప‌రిచ‌యం కావాలంటే బేబీ షామిలి అన్న మాట‌. చిన్న‌పుడే దాదాపు 100 సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత చ‌దువుల కోస‌మ‌ని సినిమాలు మానేసింది. తొమ్మిదేళ్ళ‌ కింద తెలుగులో సిద్ధార్థ్ ఓయ్ సినిమాతో హీరోయిన్ గానూ ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో సినిమాల‌కు బ్రేకిచ్చేసింది. ఆ మ‌ధ్య త‌మిళ్ లో వీర‌శివాజీలో న‌టించింది ఈ భామ‌. ఇది కూడా ఫ్లాప్. దాంతో రెండేళ్ళ గ్యాప్ తీసుకుని ఇప్పుడు తెలుగు సినిమాలో న‌టిస్తుంది. నాగ‌శౌర్య హీరోగా సుంద‌ర్ సూర్య తెర‌కెక్కిస్తోన్న అమ్మ‌మ్మ‌గారిల్లు సినిమాలో షామిలి హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఓయ్ తో గాడిత‌ప్పిన షామిలి కెరీర్ ఇప్పుడైనా మ‌ళ్లీ ట్రాక్ ఎక్కుతుందో లేదో..?

More Related Stories