English   

2.0.. శంక‌ర్ కు గుర్తుందా అసలు..?

Shankar

ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు పెద్ద‌గా కోరిక‌లు ఏం లేవు.. ఆయ‌న అనుకున్న సినిమాను అనుకున్న స‌మ‌యానికి ఒక్క‌సారైనా విడుద‌ల చేయాల‌ని 30 ఏళ్ల కెరీర్ లో ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అది నెర‌వేర‌లేదు. ప్ర‌తీ సినిమాకు ఏదో ఓ స‌మ‌స్య‌తో వెన‌క్కి వెళ్ల‌డం ఈయ‌న‌కు అల‌వాటుగా మారిపోయింది. ఇప్పుడు అది ఇంకా పీక్స్ కు చేరిపోయింది. ఎంత‌లా అంటే చెప్పిన సినిమాను ఏడాది పాటు కూడా ఆల‌స్యం చేసేవ‌ర‌కు వెళ్లింది ఈ వ్య‌వ‌హారం. ఇప్పుడు 2.0 సినిమాది కూడా ఇదే ప‌రిస్థితి. సినిమా సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం టీజ‌ర్ కూడా చెప్పిన టైమ్ కు విడుద‌ల చేయ‌డం లేదు శంక‌ర్. ఆయ‌న ఎలాగూ విడుద‌ల చేయ‌డ‌ని.. ఈ మ‌ధ్యే లీకు వీరులు టీజ‌ర్ ను విడుద‌ల చేసారు. మిగిలిన ద‌ర్శ‌కులైతే టీజ‌ర్ ఎలాగూ లీక్ అయింది క‌దా అని దాన్నే అఫీషియ‌ల్ గా విడుద‌ల చేస్తారు. 

కానీ అక్క‌డున్న‌ది శంక‌ర్.. అలా చేస్తే ఆయ‌న శంక‌ర్ ఎందుకు అవుతాడు..? అందుకే ఇప్పుడు చిత్ర‌యూనిట్ కు పిచ్చెక్కించే షాక్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. టీజ‌ర్ ఎలాగూ వ‌చ్చింది క‌దా.. పాత టీజ‌ర్ నే విడుద‌ల చేద్దాం అంటే వ‌ద్దు చూసిన టీజ‌ర్ వ‌స్తే నేను ఒప్పుకోనంటూ కొత్త టీజ‌ర్ సిద్ధం చేయిస్తున్నాడు శంక‌ర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టీజ‌ర్ విడుద‌ల కాలేదు.. సినిమా ఎప్పుడొస్తుందో తెలియ‌దు. ఒక‌టి రెండు కాదు ఏడాదిన్న‌ర‌గా ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు అభిమానులు. పైగా ఇప్పుడు ర‌జినీకాంత్ వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈయ‌న త‌న స్టామినా నిరూపించుకోవాలంటే 2.0 వ‌చ్చి తీరాల్సిందే. ఒక్క హిట్ ప‌డితే కానీ ఆయ‌న కెరీర్ ఇప్పుడు గాడిన ప‌డ‌దు. కానీ శంక‌ర్ మాత్రం ఇవ‌న్నీ వ‌దిలేసి ఇండియ‌న్ 2 అంటూ క‌మ‌ల్ సినిమాపై కాన్స‌ట్రేట్ చేస్తున్నాడు. 2018లో 2.0 రాద‌ని అర్థ‌మైపోయింది.. వ‌చ్చే ఏడాదికి సినిమా వాయిదా ప‌డింది. క‌నీసం అప్పుడైనా వ‌స్తుంది అనే క్లారిటీ ఇవ్వ‌ట్లేదు శంక‌ర్. మ‌రి ఈ చిత్రంతో ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories