English   

పాయల్ పాపకు బంపర్ ఆఫర్...ఏకంగా శంకర్ సినిమాలో 

 Payal Rajput
2020-05-30 11:49:43

ఆర్ ఎక్స్ 100 లాంటి బోల్డ్ మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి బ్లాక్ బాస్టర్ కొట్టింది నటి పాయల్ రాజ్ పుత్. ఈమె నటించిన మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ కావడం ఆ సినిమాలో ఈమెది విలన్ తరహా రోల్ అయినా ఆమె అందానికి నటనకు ఫిదా అయిన అందరు మంత్ర ముగ్దులైపోయారు. దీంతో ఆమెకు టాప్ యంగ్ హీరోల నుచి కాక టాప్ సీనియర్ హీరోల నుండి వరసపెట్టి అవకాశాలు వస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.  అయితే ఆమె కొన్ని ఒప్పుకుని చేతులు కూడా కాల్చుకుంది అందుకోండి అది వేరే విషయం. అయితే ఆమెకు తాజాగా ఒక భారీ బంపర్ ఆఫర్ తగిలినట్టు చెబుతున్నారు. అదేంటంటే ఈ అమ్మడికి ఏకంగా దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకాశమోచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్‌ హీరోగా ‘ఇండియన్‌ 2’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం పాయల్‌ ను సినిమా యూనిట్ సంప్రదించిందట. ఒక వేళ ఇదే నిజమైతే పాయల్‌ కి పెద్ద బ్రేక్‌ దొరికినట్లే. ఎందుకంటే శంకర్‌ సినిమాలు ఎంత భారీగా ఉంటాయో మనకు తెల్సిందే, అదీ కాక ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో ఒకేసారి అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది భాషల్లోనూ ఆమకు క్రేజ్‌ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే అసలు ఈ ప్రచారంలో నిజానిజాలెంత? అనేది వేచి చూస్తే కానీ తెలీదు.  

More Related Stories