English   

ఊహించిందే.. శంక‌ర్ షాక్ ఇచ్చాడుగా..!

Shankar-robo-teaser
2018-03-14 10:47:54

ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు పెద్ద‌గా కోరిక‌లు ఏం లేవు.. ఆయ‌న అనుకున్న సినిమాను అనుకున్న స‌మ‌యానికి ఒక్క‌సారైనా విడుద‌ల చేయాల‌ని 30 ఏళ్ల కెరీర్ లో ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అది నెర‌వేర‌లేదు. ప్ర‌తీ సినిమాకు ఏదో ఓ స‌మ‌స్య‌తో వెన‌క్కి వెళ్ల‌డం ఈయ‌న‌కు అల‌వాటుగా మారిపోయింది. ఇప్పుడు అది ఇంకా పీక్స్ కు చేరిపోయింది. ఎంత‌లా అంటే చెప్పిన సినిమాను ఏడాది పాటు కూడా ఆల‌స్యం చేసేవ‌ర‌కు వెళ్లింది ఈ వ్య‌వ‌హారం. ఇప్పుడు 2.0 సినిమాది కూడా ఇదే ప‌రిస్థితి. సినిమా సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం టీజ‌ర్ కూడా చెప్పిన టైమ్ కు విడుద‌ల చేయ‌డం లేదు శంక‌ర్. ఆయ‌న ఎలాగూ విడుద‌ల చేయ‌డ‌ని.. ఈ మ‌ధ్యే లీకు వీరులు టీజ‌ర్ ను విడుద‌ల చేసారు. మిగిలిన ద‌ర్శ‌కులైతే టీజ‌ర్ ఎలాగూ లీక్ అయింది క‌దా అని దాన్నే అఫీషియ‌ల్ గా విడుద‌ల చేస్తారు. 

కానీ అక్క‌డున్న‌ది శంక‌ర్.. అలా చేస్తే ఆయ‌న శంక‌ర్ ఎందుకు అవుతాడు..? అందుకే ఇప్పుడు చిత్ర‌యూనిట్ కు పిచ్చెక్కించే షాక్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. టీజ‌ర్ ఎలాగూ వ‌చ్చింది క‌దా.. పాత టీజ‌ర్ నే విడుద‌ల చేద్దాం అంటే వ‌ద్దు చూసిన టీజ‌ర్ వ‌స్తే నేను ఒప్పుకోనంటూ కొత్త టీజ‌ర్ సిద్ధం చేయిస్తున్నాడు శంక‌ర్. ఉన్న టీజ‌ర్ విడుద‌ల చేయ‌డానికే ఇంత టైమ్ ప‌డుతుంటే ఇప్పుడు కొత్త టీజ‌ర్ అంటున్నాడు. అంటే ఇప్ప‌ట్లో ఈ టీజ‌ర్ ను చూసే మోక్షం ప్రేక్ష‌కుల‌కు ఉందో లేదో..? ప‌్ర‌స్తుతం అమెరికాలో టీజర్ కోసం వర్క్ జరుగుతోంది. ఈ సినిమా విడుద‌ల తేదీపై కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. సినిమా దివాళికి వ‌స్తుంద‌ని చెబుతున్నా.. అస‌లు 2018లో వ‌స్తుందా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి.

More Related Stories