English   

మద్యం మత్తులో మూడు వాహనాలను ఢీకొట్టిన యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌

Shanmukh Jaswanth
2021-02-27 21:00:19

మద్యం మత్తులో కారు నడిపిన యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్ వేగంగా వచ్చి కారుతో బీభత్సం సృష్టించాడు. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లి స్థానికంగా ఆందోళన రేకెత్తించాడు.ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్‌ పరిధిలోని జర్నలిస్టు కాలనీ హుడా హైట్స్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా అతనికి 170 రీడింగ్ చూపించినట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదానికి కారణమైన కారును సీజ్‌ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Related Stories