English   

బయోపిక్ ‘సెల్యూట్’ చెప్పిన షారుఖ్ ఖాన్..!!

sharukh khan -  01

కొన్నాళ్ల క్రితం వరకూ బాలీవుడ్ ను శాసించిన బాద్ షాగా ఉన్నాడు షారుఖ్ ఖాన్. కానీ దశాబ్ధం క్రితమే బాలీవుడ్ మారింది. కానీ షారుఖ్ మారలేదు. రొటీన్ రొడ్డకొట్టుడు రొమాంటిక్ డ్రామాస్ తో బోర్ కొట్టించాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ కూడా కథాబలం ఉన్న సినిమాల కోసం ఇమేజ్ ను పక్కన బెడుతున్నా.. ఇతను మాత్రం ఇంకా తానేదో యంగ్ స్టర్ అన్నట్టుగా ఫీలవుతున్నాడు. ఇది కూడా అతనికి పెద్ద మైనస్ గా మారింది.  దీంతో ఆడియన్స్ అతని సినిమాల వైపు చూడ్డం కూడా మానేశారు. ఈ దశాబ్ధంలో అతని ఖాతాలో ఉన్నది ఒకటో రెండో హిట్స్ మాత్రమే. ఇది చాలు.. అతని కెరీర్ ఎలాంటి స్థితిలో ఉందో చెప్పడానికి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ లో కానీ సౌత్ లో కానీ బెస్ట్ సెల్లింగ్ గా ఉన్న బయోపిక్స్ వైపు దృష్టి పెట్టాడు షారుఖ్.  

భారతదేశం నుంచి మొదటి సారిగా చంద్రమండలంపై అడుగుపెట్టిన సైంటిస్ట్ రాకేశ్ శర్మ. అతని లైఫ్ స్టోరీనే వెండితెరపై రాబోతోంది. ఈ సినిమాకు ‘సెల్యూట్’ అనే టైటిల్ కన్ఫార్మ్ చేశారు. సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతోన్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో.. షారుఖ్ రాకేశ్ శర్మ పాత్ర చేయబోతున్నాడు.అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ. 1984 ఏప్రిల్ 3 న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కల్సి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినాడు.

అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములలో ఇతను 138 వ వాడు. భారత్ నుంచి మొదటివాడు. రాకేశ్ శర్మ ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి రాకేశ్ శర్మ లైఫ్ స్టోరీ అంటే ఖచ్చితంగా ఇది స్పేస్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కదా.. సో.. మనకు మరో అద్భుతమైన సినిమా రెడీ కాబోతోందని అనుకోవచ్చు. నటుడుగా షారుఖ్ ఖాన్ కు వంక పెట్టలేం. అందుకే రాకేశ్ శర్మ పాత్రను అతను అద్భుతంగా పోషిస్తాడనడంలో డౌటేం లేదు. అయితే ఇప్పటి వరకూ రొటీన్ స్టోరీస్ తో ఇబ్బంది పడ్డ షారుఖ్ కు ఈ బయోపిక్ కొత్త టర్న్ ఇస్తుందేమో చూడాలి. 

More Related Stories