English   

శర్వానంద్ చేతులమీదుగా 'పరిచయం' సెకండ్ సాంగ్ రిలీజ్..!!

sharvanand -1
2018-06-29 15:52:55

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రియాజ్ నిర్మాతగా  లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం “పరిచయం”. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని రెండోపాట 'రావాఇలా' ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి విడుదల చేసారు. 

విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా జూలై 20న విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన 'ఏమైందో మనసా' పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లబించింది. ఈ చిత్ర నైజాం రైట్స్ ను ఏషియన్ సంస్థ సొంతం చేసుకుంది. 

నటీనటులు:
విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ తదితరులు.

సాంకేతిక నిపుణులు

రచన దర్సకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా 
నిర్మాత: రియాజ్ 
మ్యూజిక్: శేఖర్ చంద్ర   
లిరిక్స్: భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ
డైలాగ్స్: సాగర్
సినిమాటోగ్రఫీ: నరేష్ రానా 
కోరియోగ్రఫీ: విజయ్ ప్రకాష్, హరికిరణ్
ఫైట్స్: రామకృష్ణ
చీఫ్ కో డైరెక్టర్: సత్యం కల్వకోలు
ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి 
పి ఆర్ ఓ:వంశీ శేఖర్
ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్
 

More Related Stories