English   

శర్వానంద్ కు అంతుందా..?

Sharwanand

వరుస హిట్స్ తో జోష్ మీదున్న స్టార్ శర్వానంద్. డిఫరెంట్ సబ్జెక్ట్స్త్ తో ఆకట్టుకుంటోన్న శర్వా ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడిపడి లేచెను మనసే అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు. నిజానికి ఈ కాంబినేషన్ పై ఓ సస్పెన్స్ ఉండేది. కానీ ఫైనల్ గా ఇది చేస్తున్నాం అని ప్రకటించారు. ఇది మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అంటున్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సత్య-2 అంటూ ఇలాగే చేశాడు శర్వా. కానీ అది పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతున్నారు. అయినా మళ్లీ గ్యాంగ్ స్టర్ అంటున్నాడంటే ఆలోచించుకోవాల్సిన విషయం. పైగా సుధీర్ వర్మ సినిమాలేవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు పెద్దగా మెప్పించిన దాఖలాలు లేవు. అయినా ఈ కాంబినేషన్ సెట్ అయిందంటే కారణం కథే అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ బడ్జెట్ 20కోట్లు పైనే అంటున్నారు. ఇది హీరో మార్కెట్, దర్శకుడి హిస్టరీ ప్రకారం చూస్తే కాస్త ఎక్కువనే చెప్పాలి. మరో విషయం ఏంటంటే ఈ సినిమా మాగ్జిమం ఓ సెట్ లోనే జరుగుతుందట. అందుకోసం ఏకంగా కోటి రూపాయలతో సెట్ వేస్తున్నారిప్పుడు. శర్వా కోసం కోటి తో సెట్ వేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఇంత పెద్ద సెట్ వేస్తూ కూడా 20కోట్లు బడ్జెట్ అంటున్నారంటే కొంత ఆసక్తిగాన అనిపిస్తోన్న దాని రికవరీయే డౌట్ గా ఉందంటున్నారు చాలామంది. ఇప్పటికైతే హీరో టెక్నీషియన్స్ మాత్రమే ఫైనల్ అయిన ఈ మూవీకి ఇంకా హీరోయిన్ ను సెలెక్ట్ చేయాల్సి ఉంది. కోటి మేటర్ పక్కన బెడితే 20కోట్ల బడ్జెట్ రికవరీ సాధ్యమా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న డౌటు. అయితే అవేవీ పట్టించుకోకుండా సినిమాపై నమ్మకంతో వెళుతోంది నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్. హారిక హాసిని బ్యానర్ అనుబంధ సంస్థ అయిన సితారా లో సినిమా కాబట్టి కొంత వరకూ రికవర్ అయ్యే అవకాశాలూ లేకపోలేదు. 

More Related Stories