English   

బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ విలన్.. 

 Shataf Figar
2019-09-17 15:35:15

బాలకృష్ణ ప్రస్తుతం కేయస్ రవికుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇక్కడే కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేసాడు దర్శకుడు రవికుమార్. మొన్నటికి మొన్న థాయ్ లాండ్ షెడ్యూల్ పూర్తైన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చారు చిత్రయూనిట్. ఇందులో బాలకృష్ణకు జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో విలన్ గా బెంగాలీ నటుడు శతఫ్ ఫిగర్ నటిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. ఇలాంటి నటున్ని తీసుకొచ్చారు ఇప్పుడు బాలయ్య కోసం. వినడానికి కూడా పేరు కొత్తగా ఉంది. ప్రస్తుతం శతఫ్ ఫిగర్ హిందీలో నటిస్తున్నాడు. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన 'మేడ్ ఇన్ చైనా'లో ప్రధాన పాత్రలో నటించాడు. దానికి ముందు 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ లో హీరో కార్తీక్ ఆర్యన్ తండ్రిగా నటిస్తున్నాడు. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో దర్శకుడు విష్ణువర్థన్ తెరకెక్కిస్తున్న 'షేర్ షా'లో కీ రోల్ చేస్తున్నాడు ఫిగర్. ఇప్పుడు బాలకృష్ణ కోసం తెలుగు పరిశ్రమకు వస్తున్నాడు. అన్నట్లు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. జై సింహా తర్వాత బాలకృష్ణ, కేయస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దీనికి రూలర్ అనే టైటిల్ ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. 

More Related Stories