English   

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే ?

biggboss3
2019-09-14 20:21:16

నాగార్జున హోస్ట్‌గా ప్రసారం అవుతోన్న బిగ్‌బాస్ రియాలిటీ సీజన్ 3 వీకెండ్ కి చేరుకుంది. ఈ సీజన్ మొదటి రండు సీజన్స్ తో పోలిస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండడం లేదు. డానికి తగ్గట్టు షోలో ముఖ్యమైన ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల వంటి వాటి గురించి సోషల్ మీడియాలో ముందుగానే లీకైపోతున్నాయి. మొదటి సీజన్ కు లేని ఈ లీకుల బెడద రెండో సీజన్ నుండి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొదటి వారం నుంచి కూడా సోషల్ మీడియాలో ఎవరి పేరు ఎలిమినేట్ అయిపోతుందని ఊహాగానాలు వస్తున్నాయో అవే నిజమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్‌లో ప్రక్రియలో రెండు వారాల క్రితం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శిల్పా చక్రవర్తి ఎలిమినేషన్ కానున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి విశ్లేషణల బట్టి చెబుతున్నారో, వోటింగ్ బట్టి చెబుతున్నారో తెలీదు కానీ ఈ విషయం నిజమో కాదో తేలాలంటే మనం రేపటి దాకా ఆగాల్సిందే.   

More Related Stories