English   

ఇన్నాళ్లకు ఈ ‘మిస్ ఎర్త్’ను పట్టించుకున్నారా..

shobhihta
2018-07-19 21:55:04

గూఢాచారి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న భామ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పాప పేరు సమీరా రావు.. ఇది సినిమాలో పేరు. మరి అసలు పేరు.. అంటారా.. శోభిత ధూళిపాల్ల.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ.. ఐదేళ్ల క్రితం అందాల పోటీల్లో సంచలనం సృష్టించిన తెలుగు బ్యూటీ.. తెనాలి అమ్మాయి. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ గా ఎంపికయ్యింది. అప్పట్లో అమ్మడి టార్గెట్ సినిమాలే అని చెప్పింది. ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా మనాళ్లు. దీంతో రెండేళ్లకు పైగా వెయిట్ చేసి బాలీవుడ్ లో రమణ్ రాఘవ్ 2.0 అనే సినిమా చేసింది. ఇందులో కాస్త బోల్డ్ గానే కనిపించింది. ఇంటిమేట్ సీన్స్ కూడా చేసి.. తను సినిమాలపై ఎంత సీరియస్ గా ఉందో కూడా చెప్పింది. కానీ ఆ సినిమా యావరేజ్ కావడంతో ఆ వెంటనే అవకాశాలు రాలేదు. కాస్త లేట్ అయినా సైఫ్ అలీఖాన్ సరసన చెఫ్ అనే సినిమా చేసింది. కానీ ఇదీ పోయింది. అయితే ఈ భామను అడవి శేష్ గుర్తించాడు. తన గూఢాచారి లో తీసుకున్నాడు. ఈ మూవీలో తనే మెయిన్ హీరోయిన్.. 

మొత్తంగా తెలుగులో హీరోయిన్ గా నటించాలనుకున్న తన కల ఇన్నాళ్లకు నెరవేరింది. నిజానికి శోభిత మన సోకాల్డ్ బాలీవుడ్ బ్యూటీస్ కంటే చాలా చాలా బెటర్. తెలగుమ్మాయి కదా అందాలారబోత చేస్తుందా అనే డౌట్ కూడా లేదు. అవసరమైతే బోల్డ్ గానూ కనిపించేందుకు రెడీగా ఉంది. తన హైట్ ను బట్టి మహేష్ వంటి హీరోల సరసన పక్కాగా సూట్ అవుతుంది. మరి ఇకనైనా ఈ అందగత్తెకు అవకాశాలిస్తారా..? 

More Related Stories