English   

RRR రెమ్యూనరేషన్ లిస్ట్ చూస్తే కళ్ళు తిరగడం ఖాయం..

RRR
2019-03-18 09:55:01

రాజమౌళి సినిమా అంటే భారీ తనంతో పాటు భారీ బడ్జెట్ కూడా ఉంటుంది. ఇక భారీ బడ్జెట్ కు తోడు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటాయి. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ కు దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందిందని వార్తలు వినిపించాయి. ఈ సినిమా కోసం ఆయన నాలుగేళ్లు కష్టపడ్డాడు కాబట్టి అంత ఇవ్వడంలో తప్పు లేదు. ఇక ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మల్టిస్టారర్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాకు కూడా రెమ్యూనరేషన్ భారీగా అందుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ గత సినిమాల కంటే దాదాపు పది కోట్ల వరకు ఈ సినిమా కోసం అదనంగా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు 17 నుంచి 20 కోట్లు తీసుకునే ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం 30 కోట్లు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక వినయ విధేయ రామ సినిమా కోసం దాదాపు 16 కోట్లు తీసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మరో 14 కోట్లు అదనంగా డిమాండ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోల రెమ్యూనరేషన్ కోసమే 60 కోట్లకు పైగా నిర్మాతకు ఖర్చు అవుతుందని.. వీళ్లతో పాటు హీరోయిన్ అలియా భట్ 12 కోట్లు.. ఫారిన్ హీరోయిన్ డైసీ 5 కోట్లు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అజయ్ దేవ్ గన్ 30 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం దాదాపు 15 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్లు కాకుండా టెక్నికల్ టీమ్ ఎలాగూ ఉంది. ఇలా కేవలం రెమ్యూనరేషన్ దాదాపు 200 కోట్లు వెళ్లిపోతున్నాయని.. మరో 150 కోట్లు మేకింగ్ కు అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి ఎంత ఖర్చయినా కూడా విడుదలకు ముందే బిజినెస్ జరుగుతుందని నమ్మకంగా ఉన్నాడు నిర్మాత డివివి దానయ్య. ఈ సినిమా 2020 జులై 30 తేదీన విడుదల కానుంది.

More Related Stories