English   

రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన హైకోర్ట్

RGV on Disha Encounter
2020-11-24 15:15:25

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ శివార్లలో హత్యచారానికి గురైన దిశ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా దిశ ఎన్కౌంటర్ చిత్రం కు సంబంధించి రాం గోపాల్ వర్మ కు హైకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపి వేయాలని ఇప్పటికే నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టు ను ఆశ్రయించారు.ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది కృష్ణా మూర్తి కోర్టుకు తెలిపారు.  ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కృష్ణ మూర్తి కోర్టుకు వెల్లడించారు. 

ఈ చిత్రం లో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని  కృష్ణ మూర్తి కోర్టుకు తెలిపారు. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని ఆయన కోరారు. దిశ సంఘటన పై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతున్నా ఎలా చిత్రం తీస్తారని కృష్ణమూర్తి కోర్టులో ప్రశ్నించారు. వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దాంతో సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ లకు హైకోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 

More Related Stories