English   

శ్రీయ పెళ్లికి రెడీ

Shriya Saran
2018-02-28 19:55:33

లేదు లేదంటూనే చిన్నదీ పెళ్లి పీటలెక్కబోతోందీ చిన్నదీ.. అని పాడాల్సింది ఎవరి కోసమో కాదు.. ముదురు భామ శ్రీయ కోసం. యస్.. ఇప్పటికే ఇండస్ట్రీలో 18యేళ్లు పూర్తి చేసుకున్న ఈ డస్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లిచేసుకోబోతోంది. నిన్నటి వరకూ లేదు లేదన్న ఈ భామ నిజంగానే ఓ రష్యన్ ను పెళ్లాడబోతోంది. అన్నట్టు రెగ్యులర్ గా కాక అమ్మడు కాస్త వెరైటీ పెళ్లి ప్లాన్ చేసుకుంది. పద్దెనిమిదేళ్ల క్రితం ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు ఇంటర్ డ్యూస్ అయింది శ్రీయ. ఫస్ట్ మూవీ ఆకట్టుకోకపోయినా.. ఆ తర్వాత మెల్లగా ఒక్కో సినిమాతో స్టార హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ్ లోని అందరు స్టార్ హీరోల సరసనా నటించేసింది. సౌత్ లో పదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది. కానీ ఏజ్ బార్ అవుతుండటం, కొత్త హీరోయిన్లు వస్తుండటంతో ఐదేళ్ల క్రితమే అమ్మడి హవా తగ్గింది. అయినా ఆఫర్స్ తగ్గలేదు. ఎప్పుడూ ఏదో సినిమా చేస్తూనే ఉన్న శ్రీయ ఇప్పుడు తేజ దర్శకత్వంలో వెంకటేష్ సరసన నటిస్తోంది.

మొత్తంగా మొన్నటి వరకూ పెళ్లి అంటే అంతెత్తున ఎగిరిన శ్రీయ వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోబోతోంది. చాలాకాలంగా తను ప్రేమిస్తోన్న ఆండ్రీనే పెళ్లాడబోతోంది శ్రీయ. మార్చి17న సంగీత్- మెహందీ ప్రోగ్రామ్ ఉంటుంది. 18న హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి. ఆ నెక్ట్స్ డే నే రిసెప్షన్ కూడా పెట్టేస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతోన్న ఈ పెళ్లి రాజస్థాన్ లో జరగబోతోంది. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటోన్నా.. ఆ విషయం తెలిస్తే ఎక్కడ ఆఫర్స్ తగ్గుతాయో అని చాలా జాగ్రత్తగా మెయిన్టేన్ చేసిందట. ఈ సీక్రెట్ మెయిన్టేన్ చేయడంలో శ్రీయ మదర్ కీలంగా వ్యవహరించిందట. మొత్తానికి ఈ మధ్యే 35యేళ్ల వయసుకు చేరుకున్న శ్రీయ ఇండస్ట్రీకి వచ్చిన 18యేళ్ల తర్వాత పెళ్లి కూతురు కాబోతోంది..

More Related Stories