English   

శ్రీయ పెళ్లైపోయింది.. 

shriya-wedding

పెళ్లంటే పందిళ్లు, తప్పట్లు తాళాలు, బంధవులు, హంగామా అబ్బో ఎన్ని ఉంటాయి. కానీ ఇవేవీ లేకుండా శ్రీయ పెళ్లి చేసుకుంది. యస్.. నిన్నటి స్టార్ హీరోయిన్ శ్రియ పెళ్లి చేసుకుంది.. గతంలో వినిపించినట్టు కాకుండా సీక్రెట్ గా మూడు ముళ్లూ వేయించుకుంది..? ఇప్పుడు సౌత్ మొత్తం ఇదే హాట్ టాపిక్. నిజమే.. శ్రీయ పెళ్లి చేసుకున్నట్టు ఆల్మోస్ట్ కన్ఫార్మ్ చేస్తున్నారు చాలామంది. అది ఓకే కానీ ఇంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. పెళ్లికి ప్రమోషన్ అక్కర్లేదు. కానీ కనీసం పదేళ్లకు పైగా సౌత్ లో ఓ వెలుగువెలిగిన శ్రీయ ఏ హంగామా లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోవడమే చాలామంది ఆశ్చర్యపరుస్తోంది. 

నిజానికి శ్రీయది డెస్టినేషన్ వెడ్డింగ్ అనిపించింది. ఉదయ్ పూర్ లో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుందని.. ఆ తర్వాత హనీమూన్ అనీ రకరకాలుగా వినిపించింది. మొదట్లో అసలు పెళ్లి వార్తలనే ఖండించిన శ్రీయ ఫైనల్ గా ఒప్పుకుంది. కానీ ఇలా ఏ హడావిడీ లేకుండా పెళ్లి చేసుకోవడం వెనక ఉద్దేశమేంటో కానీ.. ఈ నెల 12నే శ్రియ పెళ్లైపోయింది. అది కూడా తన ఇంట్లోనే. 11న మెహందీ ప్రొగ్రామ్ 12 పెళ్లి అయిపోయాయి. తను ప్రేమించిన రష్యన్ కుర్రాడు ఆండ్రీ కొశ్చేవ్ ను పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ కథ చాలాకాలంగా నడుస్తోన్నా మాగ్జిమం బయటకు రాకుండా చాలా కవర్ చేసుకుంది శ్రియ. ఏదేమైనా ఇన్నాళ్లూ పెళ్లంటేనే ఎగిరిపడ్డ అమ్మడి మెడలో మూడుముళ్లూ పడిపోయాయి. 

తెలుగులో దశాబ్ధంన్నర క్రితమే ఇష్టం సినిమాతో పరిచయం అయింది శ్రియ. ఆ సినిమా పోయినా అమ్మడి స్పార్క్ కు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. వరుస ఆఫర్స్ తో అప్పటి ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జోడీ కట్టేసింది. ఓ దశలో టాప్ హీరోయిన్ గా వెలిగిన శ్రీయ తర్వాత తమిళ్, కన్నడ, మళయాల సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం మెయిన్ హీరోయిన్ గా ఆఫర్స్ లేకపోయినా.. ప్రధాన పాత్రల సరసన నటిస్తూ హవా కంటిన్యూ చేస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగులో వీరభోగ వసంతరాయలు అనే సినిమాలో నటిస్తోంది. తర్వాత వెంకటేష్, తేజ సినిమాలోనూ తనే హీరోయిన్ అంటున్నారు. మొత్తంగా ప్రేమకథనే కాదు.. పెళ్లితంతునూ సీక్రెట్ గా మెయిన్టేన్ చేసిన శ్రీయ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. 
 

More Related Stories