English   

శ్రీ‌య మ‌రో ఆఫ‌ర్ కొట్టేసిందిగా..!

Venkatesh-shriya

సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డ‌మే ఇప్పుడు గ‌గ‌నం అయిపోయింది. అలాంటి వాళ్ల‌కు శ్రీ‌య‌ను మించిన ఆప్ష‌న్ క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికీ ఈమె హీరోయిన్ గానే కొన‌సాగుతుంద‌న్నా.. ఈమె కెరీర్ ఇప్ప‌టికీ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వెలిగిపోతుంద‌న్నా కూడా దీనికి కార‌ణం సీనియ‌ర్ హీరోలే. శ్రీ‌య కోసం ఇప్ప‌టికీ కొంద‌రు హీరోలు వేచి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. గ‌తేడాది రెండు సినిమాల్లో బాల‌య్య‌తో రొమాన్స్ చేసిన శ్రీ‌య‌.. ఇప్పుడు వెంకీతో న‌టించ‌బోతుంది. వెంక‌టేశ్ హీరోగా తేజ తెర‌కెక్కించ‌బోయే సినిమాలో శ్రీ‌య‌నే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తల్లిగా మిడిల్ ఏజ్ పాత్ర‌లో న‌టించ‌బోతుంది శ్రీ‌య‌. గ‌తంలో వెంకీతో క‌లిసి గోపాలా గోపాలా, సుభాష్ చంద్ర‌బోస్ సినిమాల్లో న‌టించింది శ్రీ‌య‌. ఈ రెండు సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. ఇప్పుడు మూడోసారి జోడీ క‌ట్ట‌బోతుంది. ఈ చిత్రం మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్లవుతోంది. ఆమెతో వ‌చ్చిన వాళ్లంతా ఇప్పుడు ఫేడ‌వుట్ అయిపోయారు. ఇంకొంద‌రు ఆంటీలు అయిపోయారు. కానీ శ్రీ‌య మాత్రం ఇప్ప‌టికీ అమ్మాయిగానే ఉంది. ఏ మాయ చేస్తుందో తెలియ‌దు గానీ 17 ఏళ్లుగా అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది ఈ 35 ఏళ్ల బ్యూటీ. తెలుగు ఇండ‌స్ట్రీకి 2001లో వ‌చ్చిన శ్రీ‌య‌.. హిందీలో ఓ ఏడాది ముందుగానే అడుగుపెట్టింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అంద‌రితోనూ ఆడిపాడిన శ్రీ‌య‌.. ఇప్పటికీ అవ‌కాశాల వేట‌లో ముందే ఉంది. ఏడాదికి క‌నీసం రెండు సినిమాలు చేస్తోంది శ్రీ‌య‌. ఇప్పుడు కూడా త‌మిళ్ లో కార్తిక్ న‌రేన్ తెర‌కెక్కిస్తోన్న న‌ర‌గాసుర‌న్ లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రంతో పాటు మ‌రో రెండు మూడు సినిమాల‌కు క‌మిటైంది శ్రీ‌య‌. వెంక‌టేశ్ సినిమాతో క‌చ్చితంగా తెలుగులో మ‌రికొన్నాళ్లు కెరీర్ కొన‌సాగుతుంద‌ని ఆశిస్తుంది శ్రీ‌య. 

తెలుగులో సీనియ‌ర్ హీరోల‌కు శ్రీ‌య బెస్ట్ ఆప్ష‌న్ గా మారిపోయింది. ఆ మ‌ధ్య గోపాలా గోపాలాలో వెంక‌టేశ్ కు భార్య‌గా న‌టించిన శ్రీ‌య‌.. ఇప్పుడు కూడా ఆయ‌న‌తోనే మ‌ళ్లీ రొమాన్స్ కు రెడీ అయింది. ఇక ఈ మ‌ధ్యే బాల‌య్యతో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, పైసావ‌సూల్ లో న‌టించింది. ఇక హిందీలోనూ ఉల‌వ‌చారు బిర్యానీ రీమేక్ త‌డ్కాలో న‌టిస్తోంది. సినిమాకు క‌నీసం 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తోంది ఈ భామ‌. దీనికి తోడు ఫ్యాష‌న్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి క‌నీసం 3 కోట్ల వ‌ర‌కు వెన‌కేస్తోంది శ్రీ‌య‌. పైగా ఇప్ప‌టికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొట్టేస్తోంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఐదేళ్లు ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయ‌డానికే నానా తిప్ప‌లు ప‌డుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 17 ఏళ్లు ఒకేలా క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్ల‌కు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది క‌దా శ్రీ‌యా..?

More Related Stories