English   

 శృతిహాస‌న్ వ‌స్తుందా.. న‌మ్మొచ్చా..? 

shruthi-hassan
2018-05-04 16:33:09

మొన్న‌టి వ‌ర‌కు శృతిహాస‌న్ ను చూసి ఏంటి ఈ భామ ఇలా మారిపోయింది..? ఇక‌పై సినిమాలు చేయ‌దా ఏంటి అనుకున్నారు. దానికి తోడు ఆమె కూడా సినిమాలంటే ఆస‌క్తి లేన‌ట్లుగానే మాట్లాడింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఏమైందో ఏమో తెలియ‌దు కానీ సినిమాల వైపు మోజు మ‌ళ్లిన‌ట్లుంది. అందుకే మెరుపుతీగ‌లా మారే క్ర‌మం మొద‌లైంది. మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన శృతి.. ఇప్పుడు అందాల‌ను బాగానే శృతి చేసింది. స‌న్న‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఓ షాపింగ్ మాల్ యాడ్ కోసం బ్యాగులు ప‌ట్టుకుని స్టైల్ గా నిల‌బ‌డింది ఈ భామ‌. ఇది చూసి కుర్రాళ్లు కూడా ఓహో శృతి బాగానే చేసిందిగా అందాల‌కు అంటూ క‌మెంట్లు చేస్తున్నారు. ఈ మ‌ధ్యే బాలీవుడ్ లో విద్యుత్ జ‌మాల్ తో ఓ సినిమా ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు తెలుగులోనూ శృతి ఓ సినిమా ఒప్పుకుంద‌ని తెలుస్తుంది. ర‌వితేజ‌తో సంతోష్ శ్రీ‌నివాస్ తెరీ రీమేక్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టించ‌నుంది. ఇందులో కేథ‌రిన్ థ్రెసా మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. గ‌తంలో ర‌వితేజ‌తో క‌లిసి బ‌లుపు సినిమాలో న‌టించింది శృతి. అది హిట్. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు తెలుగులో ఈయ‌న సినిమాతో రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ సారి ఏం అవుతుందో చూడాలిక‌..!
 

More Related Stories