English   

లవర్ తో లాక్‌డౌన్‌ అంటున్న శ్రుతి హాసన్

shruti haasan
2021-05-13 10:03:34

2019తో బ్రేకప్ అనంతరం మళ్లీ సినిమాలతో శ్రుతీ హాసన్ బిజీ అవ్వాలని ప్రయత్నించారు. కానీ ఆమెకు ఎక్కువగా ఆఫర్లు రాలేదు. తెలుగు, తమిళంలో అలా అరకొర చిత్రాలు వచ్చాయి. అందులో క్రాక్ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇక విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన లాభం చిత్రంలోనూ శ్రుతి హాసన్ నటించారు.

అయితే మళ్లీ శ్రుతీ హాసన్ ప్రేమలో పడ్డారు. ప్ర‌ముఖ ఆర్టిస్ట్ శాంతను హ‌జారిక‌తో ఆమె ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఇప్పటికే ఎన్నో హింట్లు ఇచ్చేశారు. ప్రత్యక్షంగా ప్రేమలో ఉన్నట్టు ప్రకటించకపోయినా వారు చేసే పోస్ట్‌లు, వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చాటుతున్నాయి. ఆ మ‌ధ్య‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన శాంత‌ను.. వృత్తిప‌రంగా తాము మంచి స్నేహితుల‌మ‌ని, తామిద్ద‌రికి ప‌లు అభిప్రాయాలు క‌లిశాయ‌ని, వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై తాను మాట్లాడుకోవాల‌నుకోవ‌డం లేద‌ని అన్నారు.

శ్రుతి హాసన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరూ తెగ సరసాలు ఆడుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. శాంతను బుగ్గను లాగేస్తూ శ్రుతి హాసన్ హల్చల్ చేశారు. నా బెస్టీతో లాక్డౌన్‌లో ఇలా అంటూ కొంటె చేష్టల గురించి శ్రుతి హాసన్ చెప్పుకొచ్చారు.

More Related Stories