English   

లస్ట్ స్టోరీస్ లో శృతి మించుతుందా..

shruti haasan
2020-09-28 13:02:32

హిందీలో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ పై కొంత వరకు అవగాహన ఉంటుంది. ఇక కరోన కి ముందు వెబ్ సిరీస్ లకు అంత ప్రాధాన్యత లేకపోయినా కారోనా వచ్చాక మాత్రం బాగా కలిసొచ్చింది. దాంతో బడా హీరోలు, ప్రముఖ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా బాలీవుడ్ లో హిట్టయ్యిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లోని నాలుగు ఎపిసోడ్ లను నలుగురు ప్రముఖ దర్శకులు తెరకెక్కిస్తున్నారు. తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, సంకల్ప రెడ్డి ఒక్కో ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సీనుమాల్లో తెలుగు భామ ఈషా రెబ్బా కూడా ఉండటం విశేషం. కాగా హిందీలో ఈ వెబ్ సిరీస్ లో నటించిన కియార అద్వానీ ఆ తరవాత బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంది. లస్ట్ స్టోరీస్ లో కియార బోల్డ్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారట. ఇక తెలుగులో ఆ పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. అంతే కాకుండా తెలుగులో హిందీ కి మించి రొమాన్స్ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. మరి శృతి హాసన్ శృతిమించుతుందో లేదో చూడాలి.
 

More Related Stories