English   

ఇంత‌కీ శృతి చేస్తున్న‌ట్లా.. లేదా..? 

Shruti-Haasan
2018-07-07 15:07:09

అంటే మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుందా.. వ‌స్తే తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుందా.. వ‌స్తే ఇక్క‌డ మ‌ళ్లీ గ్లామ‌ర్ షో చేస్తుందా.. చేస్తే ఇలాంటి బొద్దుత‌నంతో ఎలా నెగ్గుకొస్తుంది.. ఇలా ఇప్పుడు శృతిహాస‌న్ ను చూస్తుంటే అభిమానుల మ‌దిలో ఇన్ని అనుమానాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు శృతి కూడా ఇదే విష‌యం ఆలోచిస్తున్న‌ట్లుంది. మొన్న‌టి వ‌ర‌కు శృతిహాస‌న్ ను చూసి ఏంటి ఈ భామ ఇలా మారిపోయింది..? ఇక‌పై సినిమాలు చేయ‌దా ఏంటి అనుకున్నారు. దానికి తోడు ఆమె కూడా సినిమాలంటే ఆస‌క్తి లేన‌ట్లుగానే మాట్లాడింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఏమైందో ఏమో తెలియ‌దు కానీ సినిమాల వైపు మోజు మ‌ళ్లిన‌ట్లుంది. అందుకే మెరుపుతీగ‌లా మారే క్ర‌మం మొద‌లైంది. 

మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన శృతి.. ఇప్పుడు అందాల‌ను బాగానే శృతి చేసింది. స‌న్న‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ మ‌ధ్య ఓ షాపింగ్ మాల్ యాడ్ కోసం బ్యాగులు ప‌ట్టుకుని స్టైల్ గా ఫోటో షూట్ చేసిన ఈ భామ‌.. ఇప్పుడు పూర్తిగా క‌ప్పుకుని మ‌రో ఫోటోషూట్ చేసింది. న‌డుము మాత్ర‌మే చూపిస్తూ బాగానే మాయ చేసింది శృతి. ఇది చూసిన త‌ర్వాత శృతికి మ‌ళ్లీ ఫిజిక్ పై దృష్టి త‌గ్గిందా అనుకుంటున్నారు..! ఈ మ‌ధ్యే బాలీవుడ్ లో విద్యుత్ జ‌మాల్ తో ఓ సినిమా ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. కానీ తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీలను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. మొత్తానికి ఏం చేయాల‌నుకుంటుందో క్లారిటీ అయితే లేదు కానీ ఏదో చేస్తుంది ఈ భామ‌.

More Related Stories