English   

కొత్త బాయ్ ఫ్రెండ్ తో శృతిహాసన్.. ఎవరీ లక్కీ ఫెల్లో

Shruti Haasan
2021-01-28 15:49:19

కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి వచ్చిన శృతి హాసన్ తన సొంత టాలెంట్ తో టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. గబ్బర్ సింగ్ కి ముందు ఐరన్ లెగ్ అంటూ ఈ అమ్మడిపై కామెంట్స్ చేయగా గబ్బర్ సింగ్ తరవాత గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. దాంతో వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. ఇక లేటెస్ట్ గా క్రాక్ సినిమా హిట్ తో శృతి హాసన్ స్వింగ్ మీద ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే శృతి హాసన్ అప్పట్లో తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగి తరచూ వార్తల్లో నిలిచింది. లండన్ చెందిన మైకేల్ కొర్సలే తో ప్రేమలో పడ్డ శృతి హాసన్ ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కింది. 

అప్పట్లో ఈ అమ్మడి లవ్ మ్యాటర్ పెళ్లి వరకు వెళ్ళింది. కమల్ హాసన్ పెళ్లికి ఒప్పుకున్నాడు..ఇక మిగిలింది పెళ్లి మాత్రమే అని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని రోజులకు వీరి ప్రేమ పెటాకులైంది. తమ లవ్ స్టొరీకి ఎండ్ కార్డు పడిందని మైకేల్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇక అప్పటి నుండి శృతి హాసన్ సింగిల్ గా నే ఉంది. కానీ కొద్ది రోజులుగా ఈ అమ్మడు మళ్లీ ప్రేమలో పడిందంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ లక్కీ ఫెల్లో ఎవరా అని శృతి అభిమానులు ఎదుచూస్తున్నారు. అయితే ఈ వార్తలకు బలం చేకూరేలా జనవరి 27 న బాయ్ ఫ్రెండ్ తో కలిసి ముంబై వీధుల్లో కనిపించింది శృతి హాసన్. కానీ శృతి ఆమె బాయ్ ఫ్రెండ్ ముఖానికి మాస్క్ ధరించి ఉండటంతో అతడు ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు.

More Related Stories