English   

తెలుగులో మళ్లీ ‘శ్రుతి’ చేస్తోందా..?

shruti-haasan

తండ్రికి తగ్గ తనయ.. ఈ మాట శ్రుతి హాసన్ కు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ నటనలో కాదు.. లైఫ్ స్టైల్ లో. యస్.. తనకు నచ్చినట్టు బతికేయడంలో శ్రుతి కమల్ కు ఏ మాత్రం తీసిపోదు. సినిమాల్లో స్టార్ కూతురుననే ఇబ్బంది పెట్టదు.. రియల్ లైఫ్ లో తండ్రి ఇమేజ్ ఏమైపోతుందో అనేదీ పట్టించుకోదు. అందుకే తను కమల్ హాసన్ కు ఫిమేల్ వెర్షన్ అనేవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా కొన్నాళ్లుగా తెలుగులో సినిమాలు చేయకుండా హ్యాపీగా లైఫ్ గడిపేస్తోందీ బ్యూటీ. అటు బాలీవుడ్ లోనూ సినిమాలు లేవు. ఎవరైనా ఇదేమంటే.. ‘నా ఇష్టం’ అంటుంది. మరి కెరీర్ అంటే‘ పోతే పోనీ’ అంటుంది. అందుకే తనను కమల్ కు తగ్గ తనయ అనేది. అయితే లేటెస్ట్ గా మళ్లీ శ్రుతిని టాలీవుడ్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. 

శ్రుతి హాసన్ ను రవితేజ సినిమాలో నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. గతంలో ఈ ఇద్దరూ కలిసి బలుపు అనే సినిమాలో నటించారు. అది మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం రవితేజ నేల టిక్కెట్టు ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తుందీ మూవీ. దీని తర్వాత కూడా మరో యాక్షన్ ఎంటర్టైనర్ కే ఓకే చెప్పాడీ మాస్ రాజా. ఈ సినిమాలోనే శ్రుతి హాసన్ ను తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తుంది. అయితే శ్రుతి ఒప్పుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ మూవీ మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఉండబోతోంది. మైత్రీ మూవీస్ లో సినిమాకు ఓకే చెబితే అది శ్రుతి హాసన్ కు కూడా మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. ఆ కారణంగా అయినా ఒప్పుకుంటుంది అంటున్నారు. మరి ఒప్పుకుంటుందా.. లేదా అనేది చూడాలి. 

More Related Stories