English   

ఎనిమిదేళ్ల తరవాత తెలుగు సినిమా..సిద్దార్థ్ ఎమోషనల్ పోస్ట్

Siddharth
2020-10-31 11:43:26

ఆర్ ఎక్స్100 సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం "మహాసముద్రం" అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ మరియు సిద్దార్థ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎనిమిదేళ్ల తరవాత మళ్ళీ తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉందని సిద్ధార్థ్ పేర్కొన్నారు. ఈసారి గ్రేట్ టీమ్ తో వస్తున్నానని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సినిమాతో తనకు తెలుగులో మళ్ళీ అవకాశాలు వస్తాయని అనుకుంటున్నట్టు వెల్లడించాడు. అంతే కాకుండా తెలుగులో సిద్దార్థ్ చాలా ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నాడు. అందరి ఆశీర్వాదాలు కావాలంటూ సిద్ధార్థ్ తెలిపాడు.ఇదిలా ఉండగా సిద్ధార్థ్ తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు సాధించాడు. పక్కింటి అబ్బాయ్ లా కనిపించే సిద్ధార్థ్ బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. ఆ తరవాత సిద్ధార్థ్ "ఓయ్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా"లాంటి సినిమాలతో టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పాపులర్ అయ్యాడు. కాగా ఆ తరవాత సిద్ధార్థ్ కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు ఆడకపోవడంతో తెలుగు పరిశ్రమలో ఎనిమిదేళ్ల గ్యాప్ వచ్చింది. ఇక రీఎంట్రీ ఇస్తున్న ఈ లవర్ బాయ్ మళ్ళీ తన క్రేజ్ ను తిరిగి సంపాదించుకుంటాడా..లేదా చూడాలి.

More Related Stories